Tuesday, August 16, 2022
HomeEntertainmentCinema Latestచెర్రీ, సమంతల మద్య ఒక కమెడియన్‌.. అదే హైలైట్‌

చెర్రీ, సమంతల మద్య ఒక కమెడియన్‌.. అదే హైలైట్‌

విభిన్న స్క్రీన్‌ప్లేతో సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకునే సుకుమార్‌ ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా సమంత హీరోయిన్‌గా ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మునుపెన్నడు తెలుగు ప్రేక్షకులు చూడని కథాంశంతో తెరకెక్కుతుంది. హీరో రామ్‌ చరణ్‌కు ఈ సినిమాలో చెవులు వినిపించవట. పూర్తి పల్లెటూరు కుర్రాడిగా చరణ్‌ కనిపించనున్నాడు. ఇక సమంత ఒక మోడ్రన్‌ అమ్మాయిగా కనిపించబోతుంది. వీరిద్దరి మద్య ప్రేమ ఎలా చిగురించింది, వీరిద్దరి మద్య ప్రేమకు కమ్యూనికేషన్‌ ఎలా సాధ్యం అయ్యింది అనేది సినిమాలో ఆసక్తిగా దర్శకుడు సుకుమార్‌ చూపించనున్నాడని తెలుస్తోంది.

ఇక చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి మరో ఆసక్తికర విషయం కూడా తొస్తోంది. చెవిటి వాడు అయిన హీరో, ఎడ్యుకేటెడ్‌ అయిన హీరోయిన్‌ మద్య లవ్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయని, వాటిని కామెడీ కలిపి దర్శకుడు సుకుమార్‌ వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నాడని చెబుతున్నారు. వీరిద్దరి మద్య ఒక కమెడియన్‌ లవ్‌ సీన్‌ను నడుపుతూ ఉంటాడని, సమంత ఏమన్నా కూడా చరణ్‌కు ఈ కమెడియన్‌ సైగలతో చెప్తాడని అంటున్నారు. ఆ కమెడియన్‌ ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. వెన్నెల కిషోర్‌ అయ్యే ఛాన్స్‌ ఎక్కువ ఉంది. సుకుమార్‌ సినిమాల్లో వెన్నెల కిషోర్‌ మార్క్‌ పాత్రలు ఉండవు. మరి ఎవరితో ఆ పాత్రను చేయించాడో చూడాలి. వీరి ముగ్గురి కాంబోలో వచ్చే సీన్స్‌ ఆకట్టుకుంటాయని అంటున్నారు.

- Advertisment -
spot_img

Most Popular