త్రివిక్రమ్ సినిమాలో కోలీవుడ్ కమీడియన్

 Posted March 29, 2017

comedian robo shankar in pawan kalyan trivikram movieమాటల మాంత్రికుడు సినిమా అంటేనే పంచ్ డైలాగ్ లు, ప్రాస వాక్యాలతో నిండిపోతుంది. అలానే ఆయన సినిమాలో కామెడీ సన్నివేశాలు కూడా చాలానే ఉంటాయి. అత్తారింటికి దారేది సినిమాలో అహల్య అమాయకురాలు, అ ఆ సినిమాలో పెళ్లి చూపుల సీన్ వంటి కామెడీ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. s/o సత్యమూర్తి సినిమా వరకు బ్రహ్మానందం వంటి టాప్ కమీడియన్స్ ని వాడిన త్రివిక్రమ్..  అ ఆ సినిమాలో మాత్రం సీనియర్  కమీడియన్లకు అవకాశం కల్పించలేదు.

ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేసి  పవన్ సినిమాలో కోలీవుడ్ నుండి కమీడియన్ దింపుతున్నాడట. మారి, సింగం 3 సినిమాలతో  తమిళ్ లో  ఫేమస్ అయిన రోబో శంకర్ ని పవన్ సినిమా కోసం త్రివిక్రమ్ సెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్త తెలుసుకున్న సినీ విమర్శకులు ఇప్పటికే తెలుగులో పలువురు తమిళ హీరోహీరోయిన్స్ ఎక్కువైపోయారని, కోలీవుడ్ నుండి డబ్బింగ్ చిత్రాలు కూడా టాలీవుడ్ లో ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయని విమర్శిస్తున్నారు. ఇవి చాలవన్నట్లు కమీడియన్ లను కూడా దింపుతున్నారని అంటున్నారు. తెలుగులో కమీడియన్లు లేరా అని విమర్శిస్తున్నారు. మరి మాటల మాంత్రికుడు ఏం చేస్తాడో చూడాలి.

SHARE