శ్రీనివాస్ రెడ్డి.. రేంజ్ పెరిగిపోయిందోచ్.. !

 Posted October 29, 2016

comedian srinivas reddy jayammu nischayammura movieటాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నాడు శ్రీనివాస్ రెడ్డి.తనదైన కామెడీ టచ్ ఉన్న డైలాగులతో,కామిక్ టైమింగ్‌తో టాప్ కమెడియన్స్‌ ఒకరిగా ఎదిగాడు.కమెడియన్ గా కొనసాగుతూనే ఇటీవలే ‘గీతాంజలి’అనే సినిమాలో ఒక పూర్తి స్థాయి హీరో తరహా పాత్రలో నటించారు.

తాజాగా, శ్రీనివాస్ రెడ్డి టాలీవుడ్ కి షాకిచ్చాడు. ఆయన హీరోగా నటింటిచిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’.శివరాజ్ కనుమూరి దర్శకుడు.ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోతోంది.ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ రూ.7కోట్లు పలకడం..ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఆ ప్రభావం కాస్త ఎక్కువగానే థియేట్రికల్ రైట్స్ పై పడింది.

శ్రీనివాస్ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి సినీ జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.శ్రీనివాస్ రెడ్డి రేంజ్ పెరిగిపోయిందోచ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు, ఈ మధ్య అ ఆ,ప్రేమమ్..చిత్రాలలో శ్రీనివాస్ రెడ్డికి మంచి పాత్రలు దక్కిన విషయం తెలిసిందే.

SHARE