క్యూట్ దేవసేన ఎక్కడ..?

0
238
comments-on-devasena-poster

comments-on-devasena-poster

వచ్చే నెల 28న బాహుబలి-2  ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా పబ్లిసిటీని ప్రారంభించేసింది చిత్రయూనిట్. ఒక్కో పోస్టర్ ని రిలీజ్ చేస్తూ  సినిమాపై మరింత క్రేజ్ పెంచుతున్న  రాజమాళి మరో రెండు రోజుల్లో ట్రైలర్ ని కూడా విడుదల చేయనున్నాడు. ఇక్కడి దాకా బాగానే ఉన్నా తమ ఫేవరెట్ హీరోయిన్ అనూష్క విషయంలో మాత్రం నిరాశ చెందుతున్నారు అభిమానులు.

తన అందంతో, అభినయంతో యూత్ లో ఎంతో క్రేజ్ సాధించింది అనూష్క. జేజమ్మా అంటూ కత్తి పట్టినా, బిల్లాలో బికినీ అందాలతో యువతకి పిచ్చెక్కించినా  అనుష్కకే చెల్లింది. అయితే అలాంటి స్వీటీ.. బాహుబలి-1 లో డీ గ్లామర్ పాత్రలో కనిపించింది. కధ పరంగా ఆ సినిమా మొత్తం ముసలమ్మ గెటప్ లోనే దర్శనమిచ్చింది.  దీంతో స్వీటీ మేకప్ గురించి అప్పుడు విమర్శలు ఓ రేంజ్ లో వెల్లువెత్తాయి. తమ అభిమాన హీరోయిన్ ని అంత భయంకరంగా చూపించాల్సిన అవసరం లేదంటూ కామెంట్లు పెట్టారు. తాజాగా మరో సారి అటువంటి విమర్శలే వినిపిస్తున్నాయి. రాజమౌళి విడుదల చేసిన అనూష్క తాజా పోస్టరే అందుకు కారణం. ఈ పోస్టర్ లో అనుష్క గెటప్ మరీ భయంకరంగా వుంది. ఓల్డ్ లుక్ లో ఉన్న స్వీటీ  నెత్తిపై నిప్పుల కుంపటిని మోస్తోంది. దీంతో బాహుబలి-2లోనైనా క్యూట్ అనూష్క ని చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులు ఈ తాజా పోస్టర్ చూసి బిత్తరపోతున్నారు. విమర్శలు చేస్తున్నారు. ఫస్ట్ పోస్టర్ లో చూపించినట్లు నాజూకు నడుంతో ఉన్న దేవసేన ఎక్కడ అని అడుగుతున్నారు. మరి ఈ కామెంట్లకు సమాధానంగానైనా  ట్రైలర్ లో స్వీటీని .. హాట్ గా  చూపిస్తాడేమో చూడాలి.

Leave a Reply