కాంగ్రెస్ బిల్లు పై టీడీపీ సంతకం ..

0
649

congress bill tdp sign

   మూలనపడ్డ ప్రత్యేక హోదా అంశం దుమ్ము దులిపిన కాంగ్రెస్ ఇప్పుడు అయ్యయ్యో అనుకుంటోందా ? అందుకు కారణాలు లేకపోలేదు. కేవీపీ ప్రైవేట్ బిల్లు వెనుక కాంగ్రెస్ పెద్ద ప్లాన్ వేసింది. ఒక్క దెబ్బకు రెండుపిట్టలు అన్నట్టు ఏకకాలంలో బీజేపీ,టీడీపీ కి చెక్ పెట్టొచ్చని భావించింది. వ్యవహారం చాలావరకు వారు అనుకున్నట్టే జరిగింది. కానీ బిల్లుకు మద్దతిస్తామన్న టీడీపీ ప్రకటనతో కాస్త కంగారు పడింది.

   కమలదళం ముందు ముఖ్యంగా.. మోడీ భయముండగా తెలుగుదేశం తెగించలేదని తనకు తానే కాంగ్రెస్ ధైర్యం చెప్పుకుంది. కానీ చర్చ మొదలయ్యాక సీన్ మారిపోయింది. జైట్లీ తో సుజనా వాదనకు దిగడంతో ఖంగుతింది. కథ అక్కడితో ఆగిపోలేదు. అప్పుడే మొదలయింది. కాంగ్రెస్ కేవలం వాక్ అవుట్ తో సరిపెడితే ..చర్చ అయిన కొద్దిసేపటికే చంద్రబాబు ప్రెస్ మీట్ మొదలయింది.

నిన్నమొన్నటి దాకా బీజేపీని ఉపేక్షించిన ఆయన వచ్చిన అవకాశాన్ని వాడుకొని కమలనాధుల మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాన్ని బాబు పూర్తి స్థాయిలో వాడుకున్నారు. ఆంధ్ర ప్రజల ముందు కమలాన్ని దోషిగా నిలబెట్టడంతో పాటు తాను తెలివిగా కాంగ్రెస్ ఉచ్చునుంచి తప్పుకున్నారు. ఇదంతా చూస్తున్న రాజకీయ విశ్లేషకుడు ఒకరు కాంగ్రెస్ బిల్లు తెస్తే టీడీపీ సంతకం పెట్టిందని వ్యాఖ్యానించారు. అంతే ..రాజకీయాల్లో వ్యూహం పన్నిన వారికే ఫలితం వస్తుందన్న గ్యారెంటీ లేదు.

Leave a Reply