రేవంత్ దూకుడు ముందు కాంగ్రెస్ బలాదూర్!!

0
302
congress down revanth speed

Posted [relativedate]

congress down revanth speedతెలంగాణ రాజకీయాల్లో ప్రభుత్వం వాయిస్ తప్ప ప్రతిపక్షం గొంతు అంత బలంగా వినిపించడం లేదు. ఎందుకంటే ఏపీలో లాగా తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేదు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రతిపక్ష నాయకులు కూడా వెనుకాడుతున్నారు. ప్రతిపక్షనేత జానారెడ్డి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినా.. ఆయన ఎప్పుడో తప్ప మాట్లాడరు. కాంగ్రెస్ నుంచి అప్పుడప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కరే మాట్లాడుతుంటారు.

ప్రధాన ప్రతిపక్షం పరిస్థితి ఇలా ఉంటే.. టీడీపీ మాత్రం జోష్ లో ఉంది. టీడీపీకి ఒకరిద్దరు ఎమ్మెల్యేలే ఉన్నా వాయిస్ మాత్రం బలంగా ఉంది. దానికి ఏకైక కారణం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ అసమర్థతను ఆధారాలతో సహా ఏకిపారేయడంలో ఆయన స్టయిలే వేరు. ఆ దూకుడే ఆయనను ఓటుకు నోటు కేసులో ఇరికించిందని అంటుంటారు. జైలుకు వెళ్లి వచ్చినా రేవంత్ మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. సీఎం కేసీఆర్ ను కూడా ధైర్యంగా నిలదీస్తున్నారు. అందుకే తెలంగాణలో ప్రతిపక్షం అంటే రేవంత్ రెడ్డే అంటున్నారు అధికార పార్టీ నేతలు.

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడో బీట్ చేసేశారట. ఇప్పుడంటే టీడీపీ పరిస్థితి బాగాలేదు కానీ… ఒకవేళ ఆ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టే వారని చెబుతుంటారు. అందుకే రేవంత్ లా ఆలోచించే నాయకులు కాంగ్రెస్ కు లేకపోవడం పెద్ద లోటని హస్తం నాయకులు కూడా అంగీకరిస్తున్నారు.

Leave a Reply