84 ఏళ్ల వయసులో పార్టీ మారుతున్నాడు..

Posted February 4, 2017

congress former cm sm krishna jump to bjp party
కర్ణాటక ముఖ్యమంత్రిగా ,విదేశాంగ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ లో ఉండి కీలక పదవులు చేసిన నేత ఎస్ .ఎం .కృష్ణ .84 ఏళ్ళ వయసులో ఆయన పార్టీ మారబోతున్నారు.కొన్నాళ్లుగా వయసు సాకుగా చూపి కాంగ్రెస్ తనను పట్టించుకోవడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్న ఆయన చివరికి బీజేపీ లో చేరడానికి నిర్ణయించుకున్నారు.ఆయన తమ పార్టీలో చేరుతున్న విషయాన్ని కర్ణాటక బీజేపీ అగ్రనేత యెడ్యూరప్ప ధృవీకరించారు.ఎడ్డీ తో కృష్ణ ఇప్పటికే చర్చలు జరిపారు.ఈ విషయం తెలిసి కాంగ్రెస్ నాయకత్వం ఆయన్ని బుజ్జగించడానికి ప్రయత్నించినా కృష్ణ నో చెప్పేశారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కృష్ణ చేరిక తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది . ముఖ్యంగా మైసూర్ బెల్ట్ లో కృష్ణ కి ఇప్పటికీ చెప్పుకోదగ్గ అనుచరగణం ఉందని బీజేపీ అంచనా వేసుకుంటోంది .ఏ వయసు సాకుగా చూపి కాంగ్రెస్ పెద్దాయన్ని పక్కన పెట్టిందో ..ఎన్నికలు అయ్యాక బీజేపీ అదే పని చేస్తే కృష్ణ గారు ఏమి చేస్తారో? అప్పుడు మారడానికి పార్టీలు ,వయసు రెండూ వుండవు కదా !

SHARE