సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ ?పాక్ వాదనకి మద్దతా?

Posted October 4, 2016

  congress leader anand sharma demand modi surgical strikes video
సర్జికల్ స్ట్రైక్స్ తరువాత మోడీ గాలి దేశమంతా వీస్తోంది.ఈ టైం లో సోనియా,రాహుల్,కేజ్రీవాల్ సైతం మోడీకి సెల్యూట్ కొట్టాల్సి వచ్చింది.ఇదే ట్రెండ్ కొనసాగితే మోడీ ధాటికి తట్టుకోలేమని కాంగ్రెస్ పెద్దలు కొందరికి డౌట్ వచ్చిందట.అందుకే స్ట్రైక్స్ పైకి సానుకూలంగానే స్పందిస్తూ ఓ మెలిక పెట్టారు ఆ పార్టీ నేతలు.సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్టు ఆధారాలు బయటపెట్టాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు.పాక్ కూడా ఇలాగే వాదిస్తూ అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదు అంటోంది.ఇప్పుడు కాంగ్రెస్ డిమాండ్ ఆ వాదనకు మద్దతిచ్చేలా వుంది.

ఈ తరహా వాదన చేయడం ద్వారా కాంగ్రెస్ మరో సమస్య కూడా తన మెడకే చుట్టుకునేట్టు చేసుకుంది.పాక్ నోరు మూయించడానికే సర్జికల్ స్ట్రైక్స్ వీడియో తీసిన కేంద్రం అదను చూసి వాటిని బయటపెట్టాలనుకుంటోంది.ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే డిమాండ్ చేస్తోంది.స్ట్రైక్స్ విషయం తెలియగానే మోడీ ప్రతిష్ట పెరిగితే ఇక వీడియో దృశ్యాలు సైతం బయటికొస్తే మోడీని ఎదుర్కోవడం కాంగ్రెస్ కి తలకి మించిన పని అవుతుంది.ఈ విషయం అర్ధం చేసుకోకుండా కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుంది.

SHARE