Posted [relativedate]
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సీఎం కేసీఆర్ అజేయమైన రాజకీయ శక్తిగా ఉన్నారు. ప్రతిఎన్నికల్లోనూ విజయదుందుభి మోగిస్తూ సత్తా చాటుతున్నారు. అటు కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ కూడా విలవిలలాడిపోతోంది. కానీ అదే కాంగ్రెస్ కు చెందిన నాయకులు ఇప్పుడు కేసీఆర్ ను డిఫెన్స్ లో నెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి … వచ్చే ఎన్నికల్ల టీఆర్ఎస్ కు ఐదు సీట్లే వస్తాయని కామెంట్ చేశారు. హరీశ్ రావు, ఈటెల తప్ప మరో ముగ్గురే గెలుస్తారట. కేసీఆర్ గెలుపు కూడా కష్టమేనట. ఇది జరిగితీరుతుందని ఆయన గట్టిగా చెప్పారు. ఎందుకంటే ఆయనకు నాలుకపై మచ్చ ఉందట. ఆ మచ్చ సంగతిని పక్కన బెడితే కోమటిరెడ్డి వ్యాఖ్యల వెనక మరో ప్లాన్ ఉందన్న ప్రచారం జరుగుతోంది.
కోమటిరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో ముఖ్య పదవిని ఆశిస్తున్నారు. ఈ తరుణంలో మీడియాను ఆకట్టుకోవడానికి ఆయన ఇలా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ను టార్గెట్ చేయడం ద్వారా మీడియాలో ఫోకస్ అవ్వాలనేది ఆయన ప్లానట. అయితే ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా? అన్నది కష్టమే. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా అది తెలంగాణకే పరిమితం. ఢిల్లీ వరకు తెలిసే ఛాన్స్ లేదు. అలాంటప్పుడు ఈ ప్లాన్ ఎలా వర్కవుట్ అవుతుందో ఆయనకే తెలియాలి.