కవిత అవినీతివల్లే ఆ ఫ్యాక్టరీకి ఈ గతా?

Posted October 5, 2016

 congress leader madhu yashki said kcr daughter kavitha doing corruption
కెసిఆర్ కుమార్తె,నిజామాబాదు ఎంపీ కవిత మీద మరోసారి అవినీతి ఆరోపణలు వచ్చాయి.ఈసారి ఆమె చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీ ఈ ఆరోపణలు చేశారు.గాయత్రీ షుగర్స్ అనే ఓ ప్రైవేట్ సంస్థ నుంచి ముడుపులు అందుకున్న ఆమె నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడం వల్ల కాదంటున్నారని యాష్కీ ధ్వజమెత్తారు.ఎన్నికల సమయంలో 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లిస్తామన్న తెరాస ఇప్పుడు ప్లేట్ తిరగేయడం వెనుక కవితకి ముడుపులు కారణమని యాష్కీ అంటున్నారు.తన ఆరోపణలకు తగిన సాక్ష్యాలు కూడా త్వరలో వెల్లడిస్తానని అయన చెప్పారు.చూద్దాం ఇది మరో ప్రెస్ మీట్ మాత్రమేనా ? అంతకు మించి విషయం ఉందో..

SHARE