తలసాని మగాడేనా..?

0
593
congress leader shabbir ali comments on talasani srinivas yadav

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

congress leader shabbir ali comments on talasani srinivas yadavతెలంగాణ పోలీసులపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ చేసిన ఆరోపణలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన కామెంట్లకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఘాటు సవాల్ విసిరారు. దిగ్విజయ్ ను హైదరాబాద్ లో కాలు పెట్టనీయమని తలసాని ప్రకటించిన తీరుపై స్పందించిన షబ్బీర్…. మొగోడివైతే డిగ్గీని హైదరాబాద్ రాకుండా అడ్డుకోవాలని తలసానికి సవాల్ విసిరారు. తలసాని ఇంటి ముందో లేకపోతే ఆయనకు అచ్చివచ్చిన మొండా మార్కెట్లోనో దిగ్విజయ్ సింగ్ తో మీటింగ్ పెడతామని షబ్బీర్ అలీ చాలెంజ్ చేశారు. దమ్ముంటే అడ్డుకోవాలని తలసానికి సవాల్ విసిరారు.

ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ తరుఫున మంత్రిగా కొనసాగుతున్న తలసానికి దిగ్విజయ్ గురించి మాట్లాడే నైతికత లేదని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ధైర్యం ఉంటే రాజీనామా చేసి గెలిచి.. ఆ తర్వాత మాట్లాడాలని తలసానికి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరం నుంచి స్కామ్స్ సిటీగా మార్చారని షబ్బీర్ అలీ విమర్శించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్స్లో దూసుకుపోతుంటే.. హైదరాబాద్ ప్రతిష్టను కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధిని మాసకబారుస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ చెప్తున్న అభివృద్ధి అంతా మాటల్లోనే కానీ చేతల్లో కనబడడం లేదని షబ్బీర్ అలీ మండిపడ్డారు.

హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తానన్న కంపెనీలు ఎందుకు పక్కరాష్ట్రాలకు పారిపోతున్నాయని ప్రశ్నించిన షబ్బీర్ అలీ అందుకు ప్రభుత్వ వేధింపులే కారణమా… లేక మరేదైనా కారణం ఉందా అనేదానిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడటం తక్కువ ప్రచారం చేసుకోవడం ఎక్కువ అన్నట్లుగా ఉందని ఆరోపించారు.

Leave a Reply