Posted [relativedate]
ఏ ప్రజాకర్షణ గల నాయకుడి గురించి అయినా ఏమి నచ్చింది అని అడిగితే తలో రకం జవాబు చెప్తారు.ఆ అడిగేది ప్రత్యర్థి పార్టీ నాయకుడిని అయితే ఏదో రాజకీయ అంశాన్ని ప్రస్తావించవచ్చు.లేదా నాయకత్వ పటిమ,వాగ్ధాటి ఇలా ఏదో అంశం గురించి మాట్లాడవచ్చు.కానీ ప్రధాని మోడీ విషయంలో కాంగ్రెస్ నేత ,మాజీ కేంద్ర మంత్రి శశి ధరూర్ మాత్రం భిన్న కోణాన్ని ఆవిష్కరించారు.రాజకీయ ప్రత్యర్థి అయినా వీలున్నప్పుడల్లా మోడీని కొద్దోగొప్పో పొగిడే అలవాటున్న శశిని ఓ జాతీయ ఛానల్ ప్రతినిధి ఓ ప్రశ్న అడిగాడు.
మోడీలో మీకు నచ్చే విషయమేంటన్నది ఆ ప్రశ్న.అందుకు శశి ఇచ్చిన జవాబు ఇది ..’శారీరక ధారుడ్యం విషయంలో మోడీ సత్తా నచ్చుతుంది..ఇన్ని దేశాలు తిరుగుతున్నా..ఇన్ని ప్రసంగాలు చేస్తున్నా ఎప్పుడూ అయన మోహంలో అలసట కనిపించదు.ఉత్సాహం పొంగిపొర్లుతూనే ఉంటుంది..మిగతా అంశాల మాటెలా వున్నా ఈ విషయంలో మోడీని మెచ్చుకోకుండా వుండలేము’. ఓ రాజకీయనేతలో ఫిజికల్ ఫిట్ నెస్ చూసిన శశి పరిశీలనని..అందుకు అర్హమైన మోడీని …ఇద్దర్నీ అభినందించాల్సిందే.