సున్నా వెనకే వైసీపీ,జనసేన వెళతాయా?

 Posted October 27, 2016

congress leader tulasi reddy said about janasena party ysrcp party
వైసీపీ …జనసేన ఉప్పునిప్పులా ఉంటున్న ఈ రెండు పార్టీలు ఒకే దారిలో వెళుతున్నాయా? అది కూడా 2014 ఎన్నికల్లో డక్ అవుట్ అయిన కాంగ్రెస్ వెంట నడుస్తాయా? ఔననే అంటున్నారు ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు…తులసిరెడ్డి గారు..అయన విడుదల చేసిన ప్రెస్ నోట్ చూసిన వారికి ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి.హోదా ఉద్యమాన్ని చేస్తున్న కాంగ్రెస్ బాటలోనే వైసీపీ,జనసేన,లెఫ్ట్ పార్టీలు,ప్రజాసంఘాలు నడవడం హర్షణీయమని అయన చెప్పుకొచ్చారు.అంతకన్నా షాకింగ్ విషయం ఏంటంటే ..2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ తో పాటు కేంద్రంలో అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతుందని చెప్పారు.ఏమైనా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసి రెడ్డి కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాత్రం ముచ్చటేస్తుంది.

SHARE