కాంగ్రెస్ పార్టీ లో అంతర్మధనం మొదలయ్యిందా..!

0
681

Posted [relativedate]

janaకాంగ్రెస్ పార్టీ లో తెలంగాణా ఎందుకిచ్చామా అనే అంతర్మధనం మొదలయ్యిందా…ఆ మధనమే ..నిన్న జానారెడ్డి బ్లాస్ట్ అవడానికి కారణమా ?తెలంగాణా అస్సెంబ్లీ కార్యక్రమాల్లో ఆ పార్టీ నాయకుడు జానా రెడ్డి మాటల తీరు చుస్తే అలానే ఉంది. తెలంగాణ అనౌన్స్ చేసిన తరువాత తెరాస చీఫ్ చంద్రశేఖర రావు అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించి రాజకీయం వేరు ఉద్యమ వేరు అనటం తోనే నర్మ గర్భం గా ఈ ఫీలింగ్ కాంగ్రెస్ పార్టీ లో ఎప్పుడో మొదలైందని అనుకోవచ్చు కాకపోతే ఈ ఫీలింగ్ ని ఇన్నాళ్లు లోపల్లోపలే అణిచి పెట్టుకున్నట్టు వున్నారల్లే ఉంది..అసెంబ్లీ లో ఈటల రాజేందర్ పదే పదే నా ..నా అనే పదాన్ని వాడటం వల్లనో ఏమో ఒక్కసారిగా జానారెడ్డి గర్జించారు ఆతర్వాత కేటీఆర్ కి ఆయనకి మధ్య జరిగిన విషయం తెలిసిందే..

మంత్రి కెటీఆర్ వంటి వారు కూడా గుడ్డిగా వెనకేసుకు రావడం మాని నిజానిజాల్ని అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమం అనేది ఒక ఇంటికో ..ఒక పార్టీ కో సంబంధం ఉన్న అనే విషయం చెప్పాలిసిన అవసరం లేదు. సహానాయకుల్ని కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని స్వంత పార్టీ నాయకులకి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.ఎందుకంటె అధికారం శాశ్వతం కాదు కాబట్టి , భవిష్యత్తులో మల్లి పోరాడాల్సివస్తే ఇతర పార్టీ లు ఈతరహా రాజకీయాల్ని నమ్ముతాయా ఆల్రెడీ ఒకేసారి దెబ్బ తిని వున్నారు ..ఈ పరిణామాలన్నిటిని ఇతర పార్టీ లు గమనించవు అనుకొంటున్నారా..?

Leave a Reply