సుష్మా లేక కాంగ్రెస్ విలవిల!!

Posted December 9, 2016

congress party doesn't have talkative person like sushma swaraj
యూపీఏ హయాంలో సుష్మాస్వరాజ్ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలిగా వ్యవహరించారు. తన వాగ్ధాటితో ప్రతి అంశంలోనూ మన్మోహన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. రివర్స్ కౌంటర్లతో యూపీఏ మంత్రులందరినీ సుష్మా కడిగిపారేసే వారు. ఒక్కోసారి సుష్మా వాగ్ధాటికి … అధికార పార్టీ నేతలు సైతం సలాం కొట్టేవారని చెబుతారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నా.. లోక్ సభలో సుష్మా లాంటి బలమైన ప్రతిపక్ష నాయకురాలు ఆ ఆపార్టీ లేరు. ప్రస్తుత ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సీనియర్ అయినా… సుష్మా లాంటి స్ట్రాంగ్ టాకింగ్ పవర్ ఆయనకు లేదు. దీంతో నోట్ల రద్దు అంశంలో కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇవ్వలేకపోతోంది. అధికార పక్షం వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నా.. హస్తం పార్టీ మాత్రం గట్టిగా నిలదీయలేకపోతున్నది. కాంగ్రెస్ నుంచి ఒక్క నాయకుడు కూడా ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించలేకపోతున్నాడు.

సుష్మా స్వరాజ్ లాంటి బలమైన నాయకురాలు కాంగ్రెస్ కు ఉండి ఉంటే… పరిస్థితి వేరేలా ఉండేదని సోనియా భావిస్తున్నారట. నాయకులు ఎంతమంది ఉన్నా.. టాకింగ్ పవర్ ఉన్న వారి అవసరం ఎక్కువగా ఉందని హైకమాండ్ భావిస్తోందని చెబుతున్నారు. మొత్తానికి సుష్మా లాంటి నాయకురాలిని కాంగ్రెస్ బాగా మిస్ అవుతోందని ఆ పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు.

SHARE