వైసీపీ పుట్టలోవేలుపెడ్తున్న కాంగ్రెస్…

0
386

kapu11454243585
ఏపీలో చంద్రబాబు సర్కార్ ని కార్నర్ చేయడానికి వైసీపీ వేసిన ఎత్తుగడల్లో ముద్రగడ ఆధ్వర్యంలో సాగుతున్న కాపు రిజర్వేషన్ ఉద్యమం ఒకటి. పేరుకి కాపు ఉద్యమం అయినా ముద్రగడతో చర్చల్లో వైసీపీకి చెందిన నేతలే కనిపిస్తారు తప్ప మిగతా పార్టీల్లోని కాపు నాయకులు అసలు కనిపించరు. తుని విధ్వంసం కేసులో ఏ వైసీపీ నేతనో,కార్యకర్తనో ప్రశ్నించినా ముద్రగడ ఒప్పుకోలేరు. అంతగా పెనవేసుకుపోయిన ఆ బంధంపై ఇప్పుడు కాంగ్రెస్ కన్ను పడింది. తాము కూడా ఆ రేసులోకి ఎంటర్ అయిపోవాలని కాంగ్రెస్ డిసైడ్ చేసుకుంది.

ఈ నెల 17 న కాపు రిజర్వేషన్ల కోసం గుంటూరు లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓ సమావేశం ఏర్పాటు చేస్తోంది.ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కాపు రిజర్వేషన్ సాధికారిత విభాగాన్ని ముందుకు తెచ్చింది.దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్న లింగంశెట్టి ఈశ్వరరావు తాజా సమావేశం గురించి పార్టీ శ్రేణులకు సమాచారం అందిస్త్తున్నారు.కాంగ్రెస్ హెహఠాత్తుగా ఇటు వైపు ఎందుకొచ్చిందా అన్న సందేహం వస్తోంది.పైగా 10 ఏళ్ల కి పైగా అధికారంలో వున్నపుడు ఎందుకు చేయలేదన్న ఎదురు ప్రశ్న కూడా వస్తుంది.అయినా కాంగ్రెస్ వ్యూహకర్తలు ఇలా వైసీపీ పుట్టలో ఎందుకు వేలు పెట్టారా అని ప్రశ్నిస్తే ఓ ఆసక్తికరమైన సమాధానం వచ్చింది.కేవీపీ ప్రైవేట్ బిల్లు తో హోదా ఉద్యమం ఊపందుకుంటే దాన్ని వైసీపీ కాష్ చేసుకుంటోందని …మేము మాత్రం ఎందుకు చూస్తూ ఊరుకోవాలని ఓ కాంగ్రెస్ నాయకుడు ఎదురు ప్రశ్నించాడు.వీళ్లిద్దరి వ్యవాహారం చూస్తుంటే నా బంగారు పుట్టలోవేలు పెడితే కుట్టనా అన్న చీమ కథ గుర్తొస్తోంది కదూ!

Leave a Reply