కాంగ్రెస్ కుందేలు పోస్టుమార్టం రిపోర్ట్..

  congress postmortem report
విభజన సమయంలో గులాం నబి ఆజాద్ చెప్పిన కుందేలు కథ ఉండవల్లి పుస్తకంలో వుంది.రాత్రి పూట కారుకి ఎదురొచ్చిన ఓ కుందేలు రోడ్డు దాటే విషయంలో నిర్ణయం తీసుకోనందున అదే వాహనం కింద పడి చనిపోయిందని ఆజాద్ చెప్పారు.దాని సారాంశం ఏంటంటే …నిర్ణయం తీసుకోవాల్సిన దశలో ఆలోచిస్తూ కూర్చుంటే ప్రాణాలు పోతాయని హెచ్చరించడం.నిజంగా ఆయన చెప్పింది అక్షారాలా నిజం .కాకపోతే కాంగ్రెస్ హైకమాండ్ కి చెప్పాల్సిన కధని తెలుగు రాష్ట్రాల నేతలకి చెప్పి తప్పు చేశారు.ఈ విషయం 2014 ఎన్నికల్లో ఆజాద్ కి,ఆయనతో ఆ కధ చెప్పించిన సోనియా కి ఆ విషయం బాగానే అర్ధమై ఉంటుంది.కానీ చచ్చిపోయిన కాంగ్రెస్ కుందేలుకి పోస్ట్ మార్టం చేస్తే అసలు విషయాలు అర్ధమవుతాయి.

ప్రత్యేకతెలంగాణ డిమాండ్ దశాబ్దాలుగా వున్నదే….
చెన్నారెడ్డి హయాం నుంచి దాన్ని తొక్కి పెట్టింది ఎవరు ? కాంగ్రెస్.

మళ్లీ చంద్రబాబుని ఎదుర్కోడానికి అదే అస్త్రాన్ని 2004 లో ప్రయోగించింది ఎవరు? కాంగ్రెస్.ప్రత్యేక తెలంగాణ నినాదంతో వచ్చిన తెరాస తో పొత్తు పెట్టుకున్నది ఎవరు? కాంగ్రెస్.

2004 నుంచి కేంద్రరాష్ట్రాల్లో అధికారంలో వున్నది ఎవరు? కాంగ్రెస్.

అప్పటిదాకా ys అడ్డుపడుతున్నాడని అనుకున్నా అయన మరణం తరువాత ..ఉద్యమం ఉవ్వెత్తున లేచినా సమస్యని మరో నాలుగేళ్లు సాగదీసింది ఎవరు? కాంగ్రెస్.

తీసుకోవాల్సిన దశలో నిర్ణయం తీసుకోకుండా ..ఎన్నికలు ముందు రాహుల్ కి పట్టంకట్టాలని హడావిడి నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో బొక్కబోర్లా పడి ప్రాణాలు పోగొట్టుకుంది ఎవరు?కాంగ్రెస్..

పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కాంగ్రెస్ కుందేలు మృతికి కారణాలు స్పష్టమయ్యాయి ..కానీ దానివల్ల పేషెంట్ బతికి బట్ట కడతాడా ?పూర్ కాంగ్రెస్.

SHARE