మరో మహా కూటమి?

0
332
congress samajwadi Party grand alliance going to uttar pradesh elections

 Posted [relativedate]

congress samajwadi Party grand alliance going to uttar pradesh elections

  • మరో మహా కూటమి?
  • యూపీ ఎన్నికలకు కొత్తపొత్తుకు తహతహ జట్టుకట్టేందుకు కాంగ్రెస్‌
  • ఎస్పీ, జేడీయూ, ఆర్‌ఎల్డీ
ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాలంటేనే దేశ వ్యాప్తంగా ఆసక్తిని కలిగస్తాయి.. పెద్ద రాష్ట్రం అవడంతో ఢిల్లీ పీఠం దక్కడానికి  ప్రతిపార్టీ అక్కడ పట్టుసంపాదించడం కీలకం.. దాంతో అక్కడ జరిగే చిన్న అంశానికి కూడా ప్రాధాన్యత తీసుకొస్తారు.. ఈ క్రమంలోనే అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల గెలుపుని కూడా అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తాయి.. త్వరలో అక్కడ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలంటే ఏ స్థాయి లో కసరత్తు చేస్తారో అర్థం చేసుకోవచ్చు… ఏ రేంజ్ లో రాజకీయ వేడి పుడుతుందో అంచనా వేయోచ్చు… ఒక వైపు అధికార సమాజ్‌వాదీ పార్టీ, మరో వైపు కేంద్ర పగ్గాలు చేపట్టిన బీజేపీ, మూడో ప్రత్యామ్నాయంగా మాయావతి సారథ్యంలోని బీఎస్సీ ఉన్నాయి.. కాంగ్రెస్‌తో సహ మిగిలిన పార్టీలన్నీ ఎవరికో ఒకరికి మద్దతు ఇచ్చి కాలం గడపాల్సిందే.. అంతర్గత కుమ్ములాటలతో ఎస్పీ, పాత తప్పుల తిప్పల్లో బీఎస్పీ ఉండటంతో బీజీపీకి అవకాశాలు కనిపింస్తున్న నేపథ్యంలో తెరపైకి మహా కూటమి ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చి గట్టి దెబ్బ కొట్టాలని వ్యూహం పన్నుతున్నారు. దాని కోసమే ఎస్పీతో కాంగ్రెస్‌, జేడీయూ, ఆర్‌ఎడ్డీ జట్టుకట్టి బలీయమైన కూటిమిగా ఏర్పాటు అవ్వాలనేది ప్రధానోద్దేశం.. 
బీహార్‌ ఎన్నికలే స్ఫూర్తి.. 
యువతలో ఉన్న క్రేజ్‌ వల్ల సార్వత్రిక ఎన్నికల్లో  బీజేపీ విజయదుందుబి మోగించింది.. పార్టీ అనటం కన్నా మోదీ గెలిచారనే చెప్పాలి.. ఆ స్థాయిలోనే యువతని, మధ్యతరగతి వర్గాన్ని ఆకర్షించగలిగారు.. ఆతరవాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మూడు రాష్ట్రాల్లో విజయబావుటా ఎగరేశారు.. అంత ఊపుమీదున్న పార్టీకి బీహార్‌ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో బీజేపీకి షాక్‌ తగిలింది.. సరిగ్గా పాకిస్థాన్‌పై సర్జికల్‌ దాడులు నేపథ్యంలో తిరిగి అభిమానం చూరగొన్న మోదీని ఎదురుక్కోవాలంటే మళ్లీ బీహార్‌ మంత్రం సరైందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. మిత్రలు శత్రువులుగా మారి బీహార్‌లో దుమ్మెత్తి పోసుకున్న జేడీయూ, ఆర్జేడీ జట్టుకట్టి భారీ విజయాన్ని పొందాయి.. అదే తరహాలో కాంగ్రెస్‌, ఎస్పీ, జేడీయూ, ఆర్‌ఎల్డీ జట్టుకట్టేందుకు తెర మంత్రాంగం జరుగుతుంది. ఎవరికెన్ని స్థానాలు కేటాయించాలనే గండాన్ని దాటగలిగితే మహాకూటమి ఏర్పాటు దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సోమవారం ఎస్పీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలో మహా కూటమిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భావిస్తున్నారని ప్రశాంత్‌ కిషోర్‌, ములాయంకు తెలియజేశారు. కాంగ్రెస్‌, ఎస్పీ, జేడీయూ, ఆర్‌ఎల్డీతో మహాకూటమిని ఏర్పాటు చేయాలన్నది రాహుల్‌ ఆలోచనగా ఉంది. మరోవైపు ఇంటిపోరుతో సతమతమవుతున్న ములాయం కూడా ‘మహా కూటమి’ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 5న నిర్వహించనున్న సమాజ్‌వాదీ 25వ వార్షికోత్సవాలను, విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు వినియోగించుకోవాలని ములాయం భావిస్తున్నారు. అందులో భాగంగా ములాయం సోదరుడు శివపాల్‌ స్వయంగా ఆర్‌ఎల్డీ చీఫ్‌ అజిత్‌ సింగ్‌, జేడీయూ నేత కేసీ త్యాగిని కలిసి ఎస్పీ వార్షికోత్సవాలకు ఆహ్వానించారు. ఇంత కసరత్తు జరుతున్న నేపథ్యంలో బీజేపీ ఎటువంటి వ్యూహం అవలంభిస్తుందో వేచిచూడాలి…

Leave a Reply