ఏపీ, తెలంగాణల్లో పంజాబ్ ఫార్ములా..!

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

congress use punjab farmula in ap and telanganaమొన్నటి పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు వెనుక పెద్ద కసరత్తు జరిగింది. పదేళ్లు అకాళీదల్ రూలింగ్‌లో వుంది కాబట్టి ఆ పార్టీపై వ్యతిరేకత వుంటుంది. ఈ క్రమంలో అప్ తెరపైకి రావడంతో ఓట్లు చీలిపోకుండా కాంగ్రెస్ కొత్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిష్టానం ఆదేశాలతో ముఖ్యంగా రిజర్వుడ్ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు ఆ పార్టీ నేతలు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కి ఇప్పటికే కొంత ఓటు బ్యాంక్ వుంది. ఎన్నికలకు ఏడాదికి ముందు నుంచే వెనుకబడిన తరగతుల ప్రజలతో దగ్గరగావుండి, వాళ్లని అన్నివిధాలా ఆదుకోవడం మొదలుపెట్టింది.

తద్వారా వాళ్ల ఓటు బ్యాంకు చీలిపోకుండా కాపాడుకుంది, అత్యధిక సీట్లు గెలుచుకుని పంజాబ్ పీఠాన్ని అందుకుంది. ఇప్పుడు ఏపీ, తెలంగాణలోనూ అదే ఫార్ములాని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. పట్టణ, సిటీ స్థాయిలో కాంగ్రెస్‌కు ఎలాగూ ఓటు బ్యాంక్ వుండడంతో ఈసారి రిజర్వుడు నియోజకవర్గాలపై దృష్టి సారించినట్టు సమాచారం. అధిష్టానం ఆదేశాలతో రెండు రాష్ర్టాల్లోని నేతలు టూర్లకు సిద్ధమవుతున్నారు. అందుకు సంబంధించిన కసరత్తు ఫైనల్ స్టేజ్‌కి వచ్చినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.

కొద్దిరోజుల్లో నేతలు ఆయా నియోజకవర్గాలకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అవసరమైన చోట్ల పార్టీ నిధులను ఉపయోగించి ప్రజలకు అవసరమైన పనుల్ని చక్కదిద్దుతూ ఓటర్లకు దగ్గరవ్వాలని హైకమాండ్ ఆదేశించినట్టు సమాచారం. కానీ పంజాబ్ లో అమరీందర్ సింగ్ అనే బలమైన ప్రాంతీయ నేత ఉన్నారు. కానీ ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ ను నాయకత్వలేమి పట్టి పీడుస్తోంది. మరి బలమైన లోకల్ లీడర్స్ ను ఎలా తయారుచేస్తారనేదే కాంగ్రెస్ కు కీలకంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here