కాంగ్రెస్ విప్ ..బీజేపీ కి చెక్

0
698

congress whip check bjp
పోయిన చోటే వెదుక్కుంటోంది కాంగ్రెస్ .విభజనతో ఆంధ్ర ప్రదేశ్ లో సున్నాకి చేరిన హస్తం పార్టీ మళ్ళీ అదే అంశం తో జీవం పోసుకునేలా ప్లాన్ చేస్తోంది .ప్రత్యేక హోదా పై కేవీపీ ప్రైవేటు బిల్లుకు మద్దతుగా ఓటేయాలని తమ రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది .ఈ విషయం లో బీజేపీ ని ఆంధ్రా కోర్టులో ముద్దాయి గా నిలబెట్టే ఏ అవకాశాన్ని వదులుకోగూడదని కాంగ్రెస్ భావిస్తోంది .

ఇప్పటికే ప్రైవేటు బిల్లుతో కమలనాధుల్ని కంగారు పెడ్తున్న కేవీపీ మరో అడుగు ముందుకేశారు .కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కి ఓ లేఖ రాశారు.విభజన సమయంలో జైట్లీ ప్రసంగాలు ,ఇచ్చిన హామీల ప్రతిని దానికి జత చేశారు . అటు మిత్ర పక్షం టీడీపీ కూడా ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇస్తామనడంతో బీజేపీ డిఫెన్స్ లో పడింది ..ఈ సమస్య పరిష్కారం పై దృష్టి పెట్టింది .

Leave a Reply