కాంగ్రెస్ దెబ్బకు డిఫెన్స్ లో టీఆర్ఎస్!!

0
285
congress won with ajay kumar

Posted [relativedate]

congress won with ajay kumarశీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ కు ఏదీ కలిసిరావడం లేదు. టీఆర్ఎస్ ఇచ్చే షాకులకు హస్తం కోలుకోలేకపోతోంది. పెద్దాయన జానారెడ్డి ఎమ్మెల్యేలను ముందుండి నడపాల్సింది పోయి… తానే ప్రభుత్వం చేతికి కత్తి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా కాంగ్రెస్ కు పైచేయి సాధించే అవకాశమొచ్చింది. దాన్ని అందిపుచ్చుకోవడంలో ఎట్ట‌కేల‌కు హస్తం విజయం సాధించింది.

పువ్వాడ అజయ్ కుమార్ కు … స్పీకర్ మధుసూదనాచారి మైక్ ఇవ్వడం గందరగోళానికి దారి తీసింది. కాంగ్రెస్ నాయకులకు వెంటనే వాస్తవం గుర్తొచ్చింది. అవును పువ్వాడ అజయ్ ఇప్పుడు కాంగ్రెస్ కాదు కదా!! అయినా కాంగ్రెస్ కు టైం ఇవ్వకపోగా… కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ అయిన సభ్యుడిగా అవకాశం ఇవ్వడమేంటి? సరిగ్గా ఇదే పాయింట్ ను పట్టుకున్నారు హస్తం నేతలు. దీనిపై గట్టిగానే వాదించారు. ఆయనకు మైక్ ఎందుకు ఇచ్చారు, ఏ పార్టీ తరఫున ఇచ్చారో చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు నిలదీశారు. చివరకు అజయ్ లేచి.. ఒక సభ్యుడిగా మాట్లాడ్డం తన హక్కు అని చెప్పుకొచ్చినా లాభం లేకపోయింది. టీఆర్ఎస్ తొలిసారిగా డిఫెన్స్ లో పడిపోయింది.

చివరకు స్పీకర్ మధుసూదనాచారి స్పందించారు. స్పీకర్ గా తన విచక్షణాధికారం ప్రకారం అజయ్ కు అవకాశమిచ్చానని చెప్పుకొచ్చారు. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాంగ్రెస్ నేతలు అప్పటికే టీఆర్ఎస్ తీరుపై నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయింపులపై కొద్దిసేపటిదాకా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. మొత్తానికి సభ అయిపోయాక తొలిసారిగా కాంగ్రెస్ సభ్యుల మొహాల్లో నవ్వు కనిపించింది అని చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఇదే స్పిరిట్ తో ఇకముందు వేగం పెంచాలని ఆకాంక్షిస్తున్నారు హస్తం క్యాడర్.

Leave a Reply