Posted [relativedate]
ఓ మాజీ సైనికోద్యోగి పై చేయి చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్ పై సస్పెండ్ . అయ్యాడు .ఈ సంఘటన భాగల్ కోట్ తాలూకా అమిన్గడ్ గ్రామంలో చోటు చేసుకుంది. మాజీ సైనిక ఉద్యోగి నందప్ప భద్రశెట్టి అకౌంట్ నుంచి డబ్బు విత్డ్రా చేసుకునేందుకు గత బుధవారంనాడు సిండికేట్ బ్యాంకు వద్ద క్యూలో నిలబడ్డారు. కస్టమర్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూలో తొక్కిసలాట జరగింది. దీంతో కానిస్టేబుల్ దేవరాజ్ గౌడర్ బ్యాంకులోంచి బయటకు వచ్చి నందప్పను నెట్టేయడంతో వారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.అంతటితో ఆగకుండా చెంప దెబ్బ కొట్టడం తో అక్కడున్న కస్టమర్లు జోక్యం చేసుకున్నారు. తనపై కానిస్టేబుల్ జరిపిన దౌర్జన్యంపై నందప్ప పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్ దేవరాజ్ గౌడర్ను సస్పెండ్ చేసినట్టు అడిషనల్ ఎస్పీ లక్ష్మీప్రసాద్ తెలిపారు. మాజీ సైనికోద్యోగిని కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన వార్త సంచలనమైంది.