మన దేశంలోనూ కార్పొరేట్ సాగు

0
332
corporate farming in india

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

corporate farming in indiaఇప్పటిదాకా అభివృద్ధి చెందిన దేశాల్లో వినిపించిన కార్పొరేట్ సాగు మాట ఇప్పుడు మన దేశంలో కూడా వినిపిస్తోంది. ఆఫ్రికా లాంటి దేశాల్లో వ్యవసాయం చేసే రైతుల్లేక మన దేశం నుంచి అన్నదాతల్ని సలహాదారులుగా తీసుకెళ్తున్నాయి. అలాంటిది మన దేశంలో ఇలాంటి ప్రపోజల్ రావడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు రైతులకు మేలు చేయమంటే నోరెత్తని ప్రభుత్వాలు.. ఇప్పుడు కార్పొరేట్ సాగుతో ఏం ఆశిస్తున్నాయనేది ఆసక్తికరంగా ఉంది.

నిజానికి విదేశాల్లో మనతో పోలిస్తే పంటల దిగుబడి చాలా ఎక్కువ. దీనికి కారణం వ్యవసాయ యాంత్రీకరణ, పెద్ద కమతాలు. మన దేశంలో అన్నీ చిన్న కమతాలే. దీంతో రైతులు ఎక్కువ పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. కూలీల కొరత పెను సమస్యగా మారింది. అదే కార్పొరేట్ సాగులో ఎంతైనా ఖర్చుపెట్టగలరు కాబట్టి.. కంపెనీలకు లాభదాయకత ఎక్కువ ఉంటుంది. మార్కెటింగ్ కూడా కంపెనీలకు కలిసొస్తుంది.

సన్న, చిన్నకారు రైతుల నుంచి భూములు లీజుకు తీసుకునే కంపెనీలు.. అన్నదాతలకు ఏటా భారీగా లీజు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు అటు పంటల దిగుబడి పెరుగుతుంది. ఇటు రైతుల జీవనప్రమాణము పెరుగుతుంది. ఇదీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన. అయితే దీన్ని యథాతథంగా కాకుండా కేంద్రం దేశవ్యాప్తంగా ఓ చట్టం తీసుకొచ్చి అమలు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply