“శ్రీమంతుడు” ఊరట పడ్డాడు..!!

0
296
court cancel Srimanthudu Story Copy Case

Posted [relativedate]

court cancel Srimanthudu Story Copy Caseకొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమా ఆ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో మహేష్ రేంజ్ తారాస్ధాయికి చేరుకుంది. అయితే  తన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించి కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ రచయిత ఆర్డీ విల్సన్ అలియాస్ శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు.  2012లో  స్వాతి మాస పత్రికకు  తాను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ నవల ఆధారంగా ‘శ్రీమంతుడు’ సినిమా తీశారని ఫిర్యాదు చేశారు.  ఈ కేసుపై విచారణ జరిపిన మొదటి అదనపు ఎంఎస్ జే కోర్టు, చిత్ర యూనిట్ తో పాటు మహేష్ బాబుకి కూడా సమన్లు జారీ చేసింది.

ఈ  ఆర్డర్ ని  సవాల్ చేస్తూ మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, దర్శకుడు కొరటాల శివ వేర్వేరుగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై  ఆయా న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ శంకర నారాయణ…  కింది కోర్టు జారీ చేసిన సమన్లు నిలిపివేయాలని ఆదేశించారు. మరి ఈ విషయంపై శరత్ చంద్ర ఎలా స్పందిస్తారో చూడాలి.  

Leave a Reply