ధనుష్ లైఫ్ స్టోరీ లో సూపర్ ట్విస్ట్..

Posted March 21, 2017

court confirm to Kathiresan and Meenakshi son dhanush because of moles
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ జీవితంలో ఏదో మర్మం దాగి వుంది.నిన్నమొన్నటిదాకా అతను మా కొడుకే అంటూ కదిరేశన్ దంపతులు చెప్తున్నా ఎవరూ నమ్మలేదు.ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొందరు..డబ్బు కోసం సెలబ్రిటీ లను ఇబ్బంది పెట్టడానికని ఇంకొందరు భావించారు.పైగా కదిరేశన్ దంపతులు కోర్టు దాకా వచ్చి నెలవారీ భత్యం కోరడంతో వారి వాదనకు ఏ మాత్రం బలం లేదనిపించింది.అయితే సినిమాలని తలదన్నే ఇంటర్వెల్ బ్యాంగ్ ధనుష్ స్టోరీ లో ముందుకొచ్చింది. ఆ సూపర్ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేదు.కానీ ఆ ట్విస్ట్ ఇప్పుడు కస్తూరి రాజా కొడుకుగా ధనుష్ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తోంది.ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటంటే..

ధనుష్ తమ కొడుకే అంటూ కోర్టుకెక్కిన కదిరేశన్ దంపతులు అందుకు సాక్ష్యంగా 10 వ తరగతి మార్క్స్ లిస్ట్ లో వున్న పుట్టుమచ్చల వివరాలు అందజేశారు.అవి నిజమో కాదో నిర్ధారించాలని ప్రభుత్వ వైద్యులకు కోర్టు ఆదేశాలిచ్చింది.పరీక్షల అనంతరం ధనుష్ ఆధునాతన లేసర్ చికిత్స ద్వారా పుట్టుమచ్చలు తీయించుకున్నట్టు వైద్యులు కోర్టుకి నివేదిక ఇచ్చారు.దీంతో ఇన్నాళ్లు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని అంతా భావించిన కదిరేశన్ దంపతుల మీద సానుభూతి, ధనుష్ మీద అనుమానం మొదలైంది.ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిన ధనుష్ లైఫ్ స్టోరీ క్లైమాక్స్ కి ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందో?

SHARE