Posted [relativedate]
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పళని స్వామికి మరో చిక్కు వచ్చి పడింది. ఆయనకి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీచేసింది.
ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో సీఎం పళనిస్వామి విశ్వాసపరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ గందరగోళం మధ్యనే స్పీకర్ ధన్పాల్ సహకారంతో బలపరీక్ష ఒన్ సైడెడ్ గా జరిగిందని, అది చెల్లదని మద్రాస్ హైకోర్టులో డీఎంకే నేత స్టాలిన్ పిటిషన్ వేశారు. ఈ పిటీషన్ ని ఈరోజు విచారించిన హైకోర్టు.. పళనిస్వామితో స్పీకర్ ధన్ పాల్, అసెంబ్లీ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలకు కూడా నోటీసులు జారీ చేసింది. మార్చి 10లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, బల పరీక్ష సమయంలోని సీసీ పుటేజీలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. మరి ఈ ఆదేశాలపై పళని ఎలా స్పందించనున్నారో చూడాలి.