ట్రంప్ కి కోర్ట్ షాక్..అయినా సవాల్

0
469

Posted [relativedate]


7 దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికి బ్రేక్ పడింది.దేశ భద్రత కోసమని ఇరాన్,ఇరాక్,సిరియా,యెమెన్,లిబియా, సుడాన్,సోమాలియా దేశస్థులు అమెరికాలో అడుగు పెట్టేందుకు వీల్లేదంటూ జనవరి 27 న ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలు ఇచ్చారు.దాన్ని సవాల్ చేస్తూ ఎందరో కోర్ట్ మెట్లు ఎక్కారు.దీనిపై సాన్ ఫ్రాన్సిస్కో కోర్ట్ తీర్పు ఇచ్చింది.ట్రంప్ ఆదేశాలు చెల్లవని పేర్కొంది.ఆ 7 దేశాల పౌరులు ఉగ్రవాదానికి పాల్పడినట్టు ఆధారాలు లేవని కోర్ట్ వ్యాఖ్యానించింది.ఈ నిర్ణయం మీ పరిధిలోది కాదంటూ ప్రభుత్వ న్యాయవాదులు వాదించినా కోర్ట్ పట్టించుకోలేదు.

court shock to trump
ఈ తీర్పుతో ట్రంప్ తోక తొక్కిన తాచులా లేచాడు.సుప్రీమ్ కోర్ట్ ని ఆశ్రయిస్తున్నట్టు ప్రకటించాడు. మళ్లీ కోర్ట్ లో కలుసుకుందాం..అయినా మీరు దేశ భద్రతను పణంగా పెడుతున్నారు..అంటూ ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని వ్యతిరేకించేవారికి సవాల్ విసిరాడు.

Leave a Reply