ఆ రాష్ట్రాల సిఎం లు బిచ్చగాళ్ళు …సిపిఐ నారాయణ

0
676
narayana

Posted [relativedate]

Image result for cpm narayana

తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని పొగుడుతూ బిచ్చగాళ్లుగా మారారని సిపిఐ నారాయణ అంటున్నారు. అంతే కాదు ‘ఒంటె అందాన్ని చూసి గాడిద ఆశ్చర్యపోతే… గాడిద రాగానికి ఒంటె మూర్ఛపోరుుందనే’ సామెత తరహాలో కెసిఆర్ ,చంద్రబాబు ల తీరు ఉందన్నారు . ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ భిక్ష కావాలని, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూతురు కేంద్ర మంత్రి కావాలని ఉందని… అందుకే ఇద్దరు దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.వరంగల్ లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ సభలో రెండో రోజు కె.నారాయణ మాట్లాడారు .

రిలయన్స్ జియోను ఏర్పాటు చేసి డిసెంబర్ వరకు ఉచిత సేవలు అందిస్తుందని.అందుకే ప్రధాని మోదీ పెద్ద నోట్లను మార్చుకునే అవకాశం డిసెంబర్ 30 వరకే కల్పించారన్నారు. ‘జియోలో పెట్టుబడులకు రూ.1.25 లక్షల కోట్లు అవసరం. రిలయన్‌‌సకు డబ్బు ఇవ్వడానికి పెద్ద నోట్లు రద్దు చేశారు. దీంతో దాచుకున్న డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసిన సొమ్మును ప్రధాని, రిలయన్‌‌స పెట్టుబడులకు ఇవ్వబోతున్నారు.ఇదే అసలు రహస్యం’ అని నారాయణ గుట్టు విప్పెసారు.

కమ్యూనిస్టులు బ్లాక్‌మనీ వారిని ప్రోత్సహిస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉందని, వెంకయ్యనాయుడిది నాలుకా తాటిమట్టా అని నారాయణ అన్నారు.

Leave a Reply