తిరుపతి సభ తర్వాత చాలా మంది పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించారు.అయితే అంతకుముందు పవన్ పై తీవ్రవిమర్శలు చేసిన సిపిఐ నేత నారాయణ మాత్రం ఈసారి సున్నిత విమర్శలతో పాటు కొన్ని సలహాలు,సూచనలు కూడా ముందుకు తెచ్చారు.రాష్ట్ర ప్రజలు అధికార,ప్రతిపక్షాలతో విసిగిపోయారని …మూడో ప్రత్యామ్నాయం కోసం జనం ఎదురు చూస్తున్నారని నారాయణ అభిప్రాయపడ్డారు.పవన్ రెండు పడవల మీద కాళ్ళు పెట్టకుండా రాజకీయాల మీద ద్రుష్టి సారిస్తే మూడో శక్తిగా ఎదిగే అవకాశం ఉందని అయన చెప్పారు.ఫుల్ టైం రాజకీయాలు చేయలేకపోతే రజని కాంత్ లాగ ఇంట్లో కూర్చోవాలని కూడా నారాయణ సలహా ఇచ్చారు.
ఓ వైపు పొగడ్తలు మరో వైపు తెగడ్తలు చేస్తూనే పవన్ ని వామపక్ష కూటమిలోకి లాగే పనిని నారాయణ సైలెంట్ గా చేసేశారు.పవన్ లో వామపక్ష భావాలున్నాయని అయితే నడకలో తడబడుతున్నాడని నారాయణ కామెంట్ చేశారు.వచ్చే ఎన్నికల్లో తాము హోదా అంశంతోటే ఎన్నికలకి వెళ్తామని కూడా చెప్పారు.ఈ డైలాగ్స్ పవన్ నారాయణ పలుకుతున్న ఇన్ డైరెక్ట్ ఆహ్వానం కాదంటారా ?