తోడుదొంగలు ఫిలిం ప్లాన్ లో లెఫ్ట్ ..

0
401

 cpi state leader ramakrishna said make a film chandrababu venkaiah naidu
వామపక్షనేతలు ముఖ్యంగా సిపిఐ ఓ పొలిటికల్ సినిమా ప్రపోజల్ ముందుకు తెచ్చింది. సినిమా పేరు తోడుదొంగలు..ఈ ముల్టీస్టారర్ మూవీ హీరోలు వెంకయ్యనాయుడు, చంద్రబాబు అయితే బాగుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రతిపాదించారు.రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా లెఫ్ట్ నేతలు సినిమా పరిభాషలో మాట్లాడ్డం ఆసక్తి రేకెత్తిస్తోంది.ఇప్పటికిప్పుడు ఈ సినిమా తీస్తేనే జనం బాగా చూస్తారని అయన అన్నారు .

బీజేపీ ఇంతకు ముందు తీసిన ప్రత్యేక హోదా సినిమా అట్టర్ ప్లాప్ అయిందని రామకృష్ణ అన్నారు.హోదా విషయంలో అన్యాయం చేసి కూడా వెంకయ్య సన్మానాలు ఎలా చేయించుకున్నారని.. అది చూస్తూ చంద్రబాబు భజన చేస్తున్నారని అయన విమర్శించారు. కోల్పోతున్న పట్టుని పెంచుకోడానికి ..జనంలోకి మళ్లీ చొచ్చుకెళ్లడానికి వామపక్షాలు తమ సిద్ధాంతాల్లో మార్పులు చేసుకోవాలని ఎన్నో సలహాలు వస్తున్నాయి.ఆ విషయాన్ని అంతగా పట్టించుకోని ఆ పార్టీల నేతలు సినీ పరిభాషతో జనానికి దగ్గర అవుదామనుకుంటున్నారేమో!

Leave a Reply