మారుతి దృష్టిలో పడ్డాడట

mr1316ఈరోజుల్లో లాంటి చిన్న సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ మారుతి ఇప్పుడు స్టార్ డైరక్టర్ లలో ఒకడు అంటే నమాల్సిందే. ఎలాంటి సినిమా అయినా సరే అది కమర్షియల్ గా సక్సెస్ అయితేనే హిట్ లేదంటే ఫట్ అన్నట్టే. అయితే తను తీసే ప్రతి సినిమాలో బాక్సాఫీస్ కు వసూళ్ల వర్షం కురిపించే లాజిక్ మిస్ అవ్వకుండా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు మారుతి. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ బాబు బంగారంతో సక్సెస్ అందుకున్న మారుతి ఇప్పుడు విలక్షణ నటుడు శర్వానంద్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త కోణంలో కనిపించే శర్వా ఈ ఇయర్ ఎక్స్ ప్రెస్ రాజాతో ఆల్రెడీ హిట్ అందుకున్నాడు. ఇక త్వరలో శతమానం భవతిగా రాబోతున్న శర్వానంద్ మారుతితో కలిసి సినిమా చేస్తున్నాడట. మారుతి సినిమా అంటే గ్యారెంటీ హిట్ అన్నట్టే. మారుతి చేతిలో పడ్డ శర్వా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ప్రస్తుతం చంద్రమోహన్ అనే నూతన దర్శకుడితో సినిమా చేస్తున్న శర్వా ఆ తర్వాత మారుతి షూటింగ్లో పాల్గొంటాడట.

SHARE