వాట్ ఏ క్రేజీ కాంబో.. ప్రభాస్ గోపిచంద్ మల్టీస్టారర్..!

pb

యంగ్ రెబల్ స్టార్ క్రేజ్ బాహుబలితో ఏ రేంజ్లోకి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోగా ఉన్నా సాటి హీరోలతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభాస్ ఇప్పుడు తన స్నేహితుడు గోపిచంద్ కోసం రిస్క్ చేస్తున్నాడు. సంపత్ నంది డైరక్షన్లో గోపిచంద్ హీరోగా ఇటీవలే ఓ సినిమా స్టార్ట్ అయ్యింది. రెబల్ నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఒకటి ఉంది. దానికోసం ఎవరిని అడుగుదామా అనుకుంటున్న సమయంలో ఆల్రెడీ ఆ నిర్మాతలు లాస్ట్ సినిమా రెబల్ లో నటించిన ప్రభాస్ గుర్తొచ్చాడు. అంతే వెంటనే ప్రభాస్ ను కలవడం రోల్ గురించి చెప్పడం ఓకే చేయడం అంతా జరిగింది.

ప్రభాస్ కూడా గోపిచంద్ కోసం సినిమా తప్పకుండా చేస్తా అన్నాడట. ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతున్న ఈ టైంలో గోపిచంద్ సినిమాలో ప్రభాస్ నటించడం క్రేజీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. వర్షం సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు చాలా కాలం తర్వాత చేస్తున్న సినిమా ఇది. మరి యంగ్ రెబల్ స్టార్ సపోర్ట్ తో హిట్ కోసం తపించిపోతున్న గోపిచంద్ ఏ రేంజ్ రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. సంపత్ నంది మార్క్ కమర్షియల్ ఎంటర్టైన్ గా రాబోతున్న ఈ సినిమాలో కేథరిన్, హాన్సిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

SHARE