సీఆర్‌డీఏ పరిధిలో ఉద్యోగాలు..

0
343

   crda said amaravathi capital 27 villages people jobs

అమరావతి రాజధాని 27 గ్రామాల్లోని నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ రకాల కంపెనీల్లో ఉపాధి కల్పించుటకు ఈ నెల 22న జాబ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.ప్రభాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్‌ ఫెయిర్‌ మండలంలోని నవులూరు గ్రామం ఆర్టీవో ఆఫీసు వద్దగల పాత లయోలా పబ్లిక్‌ స్కూల్‌లోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజధాని యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం గ్రామాల్లోని సీఆర్‌డీఏ కార్యాలయాల్లో సంప్రదించాలని తెలిపారు.

Leave a Reply