ర‌చ్చ చేయ‌డ‌మే ఎజెండానా?

0
295
creating nonsence is the only agenda

Posted [relativedate]

creating nonsence is the only agenda
నిన్న మొన్న‌టిదాకా వైసీపీ ఎమ్మెల్యేలు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో ర‌చ్చ చేసే వారు. అసెంబ్లీలో… అభివృద్ధి కార్య‌క్ర‌మాలకు ఆటంకాలు క‌లిగించేవారు. ఇప్పుడ‌ది చాల‌ద‌న్న‌ట్టు వైసీపీ అధినేత జ‌గ‌న్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. తాజాగా దివాక‌ర్ ట్రావెల్స్ బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఇది స్ప‌ష్ట‌మైంది.

ఇక ర‌చ్చ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకోవాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నార‌ని టాక్. ఆ మ‌ధ్య విశాఖ ఎయిర్ పోర్టులో గానీ… ఇప్పుడు నందిగామ‌లో కలెక్ట‌ర్, డాక్ట‌ర్ తో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరే అందుకు నిద‌ర్శ‌నం. ఒక క‌లెక్ట‌ర్ ను ప‌ట్టుకొని పోలీసుల నుంచి క‌లెక్ట‌ర్ వ‌ర‌కు అధికారులందరూ అవినీతిప‌రులేన‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. అంతేకాదు నిన్ను కూడా సెంట్ర‌ల్ జైలుకు తీసుకుపోయే కార్య‌క్ర‌మం కూడా చేస్తాం.. గుర్తుపెట్టుకోండి అంటూ క‌లెక్ట‌ర్ ను హెచ్చ‌రించారు.

రాజ‌కీయం చేయ‌డానికి కూడా కొన్ని ప‌రిమితులుంటాయి. ముఖ్యంగా ప్ర‌మాదాలు, విప‌త్తులు, ధ‌ర్నాలు, నిర‌సన‌లు ఒక్కో చోట ఒక్కో వ్యూహం ఉండాలి. కొన్ని చోట్ల ఏమీ మాట్లాడ‌క‌పోవ‌డ‌మే మంచిది. జ‌గ‌న్ మాత్రం ఇవేవీ డోంట్ కేర్ అంటున్నారు. ఇష్యూ ఏదైనా రాజ‌కీయ‌మే ముఖ్యం అన్న‌ట్టుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దివాక‌ర్ ట్రావెల్స్ బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ఒక ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆయ‌న ఏం చేయాలి? బబాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి త‌గిన న్యాయం చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరాలి. దోషుల‌ను శిక్షించాల‌ని కోరాలి. కానీ జ‌గ‌న్ మాత్రం ఇవి చేయ‌కుండా చేయాల్సిన ర‌చ్చను చేసేశారు. పోస్టు మార్టం రిపోర్ట్ కోసం డాక్ట‌ర్ తో దుర్భాష‌లాడారు. క‌లెక్ట‌ర్ పైనా విరుచుకుప‌డ్డారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌కు పోస్ట్ మార్టం రిపోర్టుకు ఏం సంబంధ‌మో జ‌గ‌న్ కే తెలియాలి?

అందుకే జ‌గ‌న్ తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ర‌చ్చ చేయ‌డమే ఆయ‌న ఎజెండాగా క‌నిపిస్తోందంటున్నారు టీడీపీ నాయ‌కులు. అయితే ఒక ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ కొంత సంయ‌మ‌నం పాటించాల‌ని ఇప్పుడు సొంత పార్టీ నేత‌లే ఆఫ్ ది రికార్డ్ గా అంగీక‌రిస్తున్నారు. అధినేత తీరుపై ప్ర‌జ‌ల్లోనూ రోజురోజుకు విశ్వాసం స‌న్న‌గిల్లుతోంద‌ని వాపోతున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా జ‌గ‌న్ ఈ ర‌చ్చ‌ను మారుకుంటారా? దాన్నే కంటిన్యూ చేస్తారా? అన్న‌ది చూడాలి!!

Leave a Reply