నీటిలో మొసలి ఎంత బలమైంది ..కానీ బయటికి వస్తే దాని ప్రాణాలకే ఎంతో ప్రమాదం.ఆలా బయటకి వచ్చి. ప్రాణాలు పోగొట్టుకొందో మొసలి.గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామం దగ్గర సమీప జలాశయాల్లోంచి బయటకి వచ్చిన మొసలి రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నించింది.అప్పుడే అటుగా దూసుకొచ్చిన రైలు ఆ మొసలిని బలి తీసుకుంది.నిర్జీవంగా పడివున్న మొసలిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు.