వార్తల నిలయం ఇపుడు వార్తయ్యింది …

364
Spread the love

cvr news no money
ఏమి ..విషయం మీడియా దాకా వెళ్ళనియ్యాలా? అబ్బో చాలా చోట్ల వినిపించే కామన్ డైలాగ్ ఇది.అసలు విషయం తెలిసినా మీడియా లో పనిచేసే వాళ్ళు కూడా చాలాచోట్ల తమ ఐడీ కార్డు అస్త్రం ప్రయోగిస్తారు.ఏమైనా సినిమా తర్వాత మీడియా కి కూడా కాస్తో కూస్తో వున్న క్రేజ్ కి ఇవి సంకేతాలు.ఆ క్రేజ్ చూసి మీడియా రంగం లోకి వచ్చిన ఎంతో మంది పెట్టుబడిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.మూసేద్దామంటే ..పరువు నష్టం ..ఎలాగోలా లాగిద్దామంటే జేబుకు చిల్లు ..ఇక జర్నలిస్టుల పరిస్థితి అంతే ..పేరు గొప్ప ..ఊరు దిబ్బ ..నమ్ముకున్న బాట లో కష్టాలు ..ఆ దారి వదిలేద్దామంటే భయాలు.

WhatsApp-Image-20160723
ఎంత కాలం దాగుతాయి ఈ రహస్యాలు ..ఒక్కోటిగా బయటపడుతున్నాయి ..ఇప్పుడు సీవీఆర్ ఛానెల్ లో జరుగుతున్న విషయాలు శాంపిల్ మాత్రమే.తాజాగా సీవీఆర్ లో జీతాల కోసం పోరాడుతున్న ఉద్యోగులపై సాటి ఉద్యోగులే తీవ్ర అవమానాల పలు చేశారంట.బయట ఉన్నవాళ్ళకి ఇది ఆశ్చర్యం అనిపించినా మీడియా లో రాజకీయాలు ..అస్తిత్వ పోరాటాలు తెలిసిన వాళ్లకి ఇది సర్వసాధారణ అంశం .ఎవరెన్ని చెప్పినా వున్నది మార్కెట్ ప్రపంచమ్..అక్కడ డిమాండ్ ..సప్ప్లై మాత్రం ఉంటాయి ..భావోద్వేగాలు ..కష్టాలు ..సుఖాలు ..వీటికి చోటు లేని చోట వాటి కోసమే వెదుకులాట వల్ల ఏమి ప్రయోజనము ..అవసరానికి మించి చానెళ్లు పెట్టి యాజమాన్యాలు ..మారుతున్న పరిణామాలని పట్టించుకోక విలేకరులు ఇబ్బంది పడుతున్నారు.

చెరువు ఎండ పెడుతున్నప్పుడు దానిలో చేపల కధ మీకు తెలుసుగా ..బయటకి వెళ్తున్న నీటిలో ముందు గా వెళ్లిన చేపలు హాయిగా బతికాయి ..నీటిమట్టం కాస్త తగ్గాక బయటపడ్డ చేపలు ప్రాణాలు దక్కించుకున్నాయి .చివరిదాకా చూద్దామనుకున్నచేపలు జనానికి ఆహారం అయ్యాయి .ఇప్పుడు టీవీ మీడియాది అదే కధ ..దాంతో సంబంధమున్న వాళ్లందరిది ఇదే కధ .ఓ వైపు ఇంటర్ నెట్ పెను వేగంతో దూసుకొస్తోంది .మరో వైపు సోషల్ మీడియా విస్తరిస్తోంది.
ఒకప్పుడు మారుమూల ప్రాంతం వార్తను తెల్లవారి పేపర్లో ఫోటో తో సహా వేస్తే ఎంత గొప్ప ?.

టీవీ వచ్చాక దాన్ని లైవ్ ఇస్తే మరెంత గొప్ప ?అందుకే ..ముందు పేపర్లు ..తర్వాత టీవీ ఛానెల్ చర్చలు చూసి రచ్చబండ ల మీద జనం రెచ్చిపోయేవాళ్లు .ఇప్పుడు సెల్ ఫోన్ లో ప్రపంచం కనిపిస్తోంది.నెట్ లో న్యూస్ ,వ్యూస్ ,ఎనాలిసిస్ అన్నీ ప్రత్యక్షం ..సిటిజెన్ జర్నలిస్టులు అనేది ఒకపుడు పెద్దమాట .సెల్ ఫోన్ చేతిలో వున్న ప్రతి ఒక్కడు ఇప్పుడు జర్నలిస్ట్.అది నమ్మే కదా ఛానళ్ళు జనాన్ని వార్తలు ఇమ్మని అడుగుతున్నాయి .అంటే ఇప్పుడు వార్త ఎవరి దగ్గరైనా దొరికే ముడి సరుకు ..దాన్ని ఎంత బాగా ప్రెజెంట్ చేయగలమన్నదే ముఖ్యం .ఎవరు బాగా రాయగలిగినా ప్రపంచమంతా చదువుతుంది ..ఆ రాసే వాళ్ళు జర్నలిస్ట్ కానక్కర్లేదు ..

ఇంకో పెద్ద ఉదాహరణ …..తెలుగులోరెండు టాప్ న్యూస్ పేపర్లు వున్నాయి ..అవి నెట్ ఎడిషన్ కొచ్చేసరికి …కేవలం పదిపదిహేను మంది పనిచేసే వెబ్ సైట్ కన్నా మెరుగైన ర్యాంకు కోసం నానా తిప్పలు పడాల్సి వస్తోంది.ఆ రెండు న్యూస్ పేపర్ల ఖర్చుతో పోల్చుకుంటే ఈ వెబ్ సైట్లు పెట్టే ఖర్చు నామమాత్రం . ఎవరు ఔనన్నా కాదన్నా ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యాలు.పరిస్థితులు ,పరిణామాలు అంత వేగంగా మారుతున్నప్పుడు విరిగే కొమ్మని పట్టుకు వేలాడబడడంలో అర్ధం ఉందా ..మార్పులకు తగ్గట్టు మారేవాడు బతుకుతాడు ..ఇది జీవ పరిణామ సిద్ధాంతం మాత్రమే కాదు…మీడియా పరిణామ సిద్ధాంతం కూడా…ఈ సిద్ధాంతాన్ని పట్టించుకోకపోవడం వల్లే వార్తలు ఇచ్చే చోటు వార్తలకు వేదిక అవుతోంది ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here