Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎవరికి ఏ అపాయం వచ్చినా ముందుగా పోలీసుల దగ్గరికి పరిగెత్తుతారు. అలాంటి పోలీస్ వ్యవస్థ మీద సైబర్ దాడి జరిగింది.ఈ దేశం ఆ దేశం అని గాకుండా ప్రపంచమంతటా పోలీస్ వ్యవస్థని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మెరుపు దాడి చేశారు.పోలీస్ వ్యవస్థలో పని చేసే కంప్యూటర్స్ పెద్ద ఎత్తున హ్యాక్ అయ్యాయి.దీన్ని రాండ్ సం మాల్ వెర్ గా అభివర్ణిస్తున్నారు. యూరప్ దేశాలతో పాటు అమెరికా,చైనా,రష్యా,ఆఫ్రికా దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా వుంది.ఇక మనదేశంలోనూ దీని ప్రభావం వుంది.అయితే నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెల్ కేంద్ర హోమ్ శాఖని అప్రమత్తం చేయడంతో కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. హ్యాకర్లు ప్రవేశపెట్టిన విన్సీ వైరస్ ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది.
దేశ వ్యాప్తంగా జరిగిన సైబర్ దాడి ప్రభావం ఏపీ లోని 25 శాతం పోలీస్ స్టేషన్స్ మీద పడినట్టు సమాచారం. సైబర్ సెల్ ఆ దాడి ప్రభావం,రక్షణ చర్యలపై ఇప్పటికే చురుగ్గా పని మొదలెట్టింది.విండోస్ ఆపరేటింగ్ సిస్టం వున్న కంప్యూటర్స్ హ్యాకింగ్ కి గురి అయినట్టు డీజీపీ సాంబశివరావు వివరించారు.తాను iOS ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నందువల్ల హ్యాకింగ్ బారిన పడలేదని ఆయన చెప్పుకొచ్చారు.విశాఖ,గుంటూరు,విజయనగరం,తిరుపతి పోలీస్ స్టేషన్స్ లో నెట్ వర్క్ ని అదుపులోకి తీసుకున్న హ్యాకర్లు వాటిని లాక్ చేసి తెరవడానికి డబ్బు డిమాండ్ చేశారు.