సైబర్‌ నేరగాళ్లకు ‘ప్రిడేటర్‌’తో చెక్‌!

0
276
cyber-frauds-had-an-end-with-predator
 Posted [relativedate]
cyberసైబర్‌ నేరగాళ్లకు ‘ప్రిడేటర్‌’తో చెక్‌!అమెరికా శాస్త్రవేత్తల కొత్త సాఫ్ట్‌వేర్‌ ఆవిష్కరణ
ఈ లింక్‌ క్లిక్‌ చేయండి.. ఎస్‌7 రూ.500కే పొందండి.. వాట్సప్‌ గోల్డ్‌ వర్షన్‌ కావాలనుకుంటున్నారా అయితే ఈ లింక్‌ సాయంతో డౌన్‌లోడ్‌ చేసుకోండి.. ఇప్పుడు సామాజిక మాధ్యమంలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ తరహా సందేశాలు కనిపించే ఉంటాయి.. వాటిని క్లిక్‌ చేస్తే తమ సమయంతోపాటు ఎదుటివారిని ఇబ్బంది పెడుతున్నట్లు గుర్తిస్తారు.. ప్రపంచ వ్యాప్తంగా రోజూ 80 వేల కొత్త వెబ్‌డొమైన్లు రిజిస్టర్‌ అవుతుంటే వాటిలో మోసగాళ్లు, విద్రోహులు, అనైతిక హ్యాకర్లు ప్రారంభిస్తున్నవే ఎక్కువ ఉంటున్నాయి.. మరి ఇలాంటి సైబర్‌ నేరగాళ్ల గురించి ఎవరూ పట్టించుకోరా అనే సందేహం కూడా కలగొచ్చు.. సరిగ్గా ఇలానే ఆలోచన చేసిన అమెరికా శాస్త్రవేత్తలు దీనికి పరిష్కారం కనుగొన్నారు..  ప్రిడేటర్‌ (ప్రోయాక్టివ్‌ రికగ్నిషన్‌ అండ్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ డొమైన్‌ అబ్యూజ్‌ అట్‌ టైమ్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌) అనే సాఫ్ట్‌వేర్‌ని రూపొందించారు. దాని సాయంతో నెటిజన్లను మోసం చేసేందుకు లేదా అనైతిక, విద్రోహ చర్యలకు పాల్పడేందుకు సిద్ధపడే సైబర్‌ నేరగాళ్లుకు చెక్‌ చెప్పొచ్చు…ఎలా పనిచేస్తుంది..
 
సాధారణంగా సైబర్‌ నేరగాళ్లు, అనైతిక హ్యాకర్లు కొత్త వెబ్‌సైట్‌ పేరును ఒక అక్షరం తేడా లేదా పదం తేడాతో వందల కొద్ది కొత్త డొమైన్లు రిజిస్టర్‌ చేస్తుంటారు. ఇదంతా సిస్టమ్‌ ఆధారిత వ్యవస్థ వల్ల ఎవరు ఎటువంటివి రిజిస్టర్‌ చేస్తున్నారు అనే అంశాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే కాని తెలియదు. రోజుకు వేలల్లో నమోదయ్యేవాటిని ఫిల్టర్‌ చేసేందుకే ఈ ప్రిడేటర్‌ ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థ 70 శాతం కచ్చితత్వంతో గుర్తిస్తుందని వారు వెల్లడించారు. మోసగాళ్లు ఒకటి రెండు అక్షరాలు, పదాల తేడాతో ఒకేసారి ఎక్కువ వెబ్‌సైట్లను రిజిస్టర్‌ చేసుకున్నా, స్పామ్‌ ఈ-మెయిల్స్‌, మాల్‌వేర్‌లను పంపినా ఈ సాఫ్ట్‌వేర్‌ వెంటనే కనిపెడుతుందని, తద్వారా సమాజానికి నష్టం జరగకముందే అలాంటి అనైతిక వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయవచ్చని పేర్కొన్నారు. ఏదైనా ఆర్థిక నేరం జరిగిన తరవాత స్పందించే కన్నా ముందుగా మేల్కొనేందుకు ఇది ఉపయోగపడుతుంది.

Leave a Reply