సైకిల్ ఎక్కేది ఎవరు?

0
517
cycle symbol for whom

Posted [relativedate]

cycle symbol for whomయూపీ అధికార పార్టీ.. సమాజ్ వాదీ పార్టీ రాజకీయం ఢిల్లీకి చేరింది. ఎన్నికల షెడ్యూల్ దగ్గరపడడంతో పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అటు ములాయం, ఇటు అఖిలేశ్ వర్గాలు ఢిల్లీలో మోహరించాయి. ఎవరికి వారు తమదే అసలైన పార్టీ అని చెప్పుకుంటున్నారు. సైకిల్ కోసం కుస్తీలు పడుతున్నారు.

సమాజ్ వాదీ లోని రెండు వర్గాలు ఇప్పుడు సింబల్ కోసం కొట్లాడుతున్నాయి. సైకిల్ కోసం ఢీ అంటే ఢీ అంటున్నారు. సైకిల్ సింబల్ ఇప్పుడే జనంలో బలంగా ఉంది. దీంతో ఎన్నికల్లో సైకిల్ సింబల్ తోనే తలపడేందుకు సై అంటున్నారు. అయితే రెండు వర్గాలు పట్టుదలతో ఉండడంతో సైకిల్ ఎవరి సొంతం అవుతుందో అంతుబట్టడం లేదు.

సమాజ్ వాదీ కర్త, కర్మ, క్రియ ములాయం సింగే. పార్టీలో నిన్న మొన్నటిదాకా ఆయనే సుప్రీమ్. సైకిల్ గుర్తుతో పార్టీని ప్రారంభించింది ములాయమే. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ములాయంకు పార్టీ నాయకుల నుంచి అంతగా సహకారం లేదు. శివపాల్ యాదవ్, అమర్ సింగ్ లాంటి వారు తప్ప పెద్దగా సపోర్ట్ చేసే వారు కనిపించడం లేదు. మెజార్టీ పరంగా చూస్తే అఖిలేశ్ కు సంపూర్ణ మద్దతు ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు యువనేతకే సపోర్ట్ చేస్తున్నారు. ములాయంను గౌరవిస్తూనే.. అఖిలేశ్ వెన్నంటి ఉంటున్నారు. క్యాడర్ అంతా అఖిలేశ్ మంత్రం జపిస్తోంది. దీంతో ఈసీ ఎవరిని కరుణిస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మెజార్టీ ఉన్న అఖిలేశ్ వైపు ఈసీ మొగ్గు చూపుతుందా? లేక ఎస్పీకి ఆద్యుడైన ములాయంకు సైకిల్ ను కేటాయిస్తుందా .. చూడాలి. అయితే పరిశీలకులు మాత్రం అఖిలేశ్ కే ఎక్కువ అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Leave a Reply