టాటా..మిస్త్రీ కి మధ్య ఏమైంది?

 Posted October 26, 2016

cyrus mistry removed as tata sons ratan tata takes over as chairman
సంస్థాగత క్రమశిక్షణ,కట్టుబాట్లకు పేరు పడ్డ టాటా గ్రూప్ లో తాజా పరిణామాలకు మిస్త్రీ తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమని తెలుస్తోంది.అందులో ముఖ్యమైనది బ్రిటన్ లో టాటా స్టీల్ కంపెనీ అమ్మాలనుకోవడమని సమాచారం.యూరప్ లో వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తున్న సమయంలో రతన్ టాటా కొన్న స్టీల్ కంపెనీ అమ్మకానికి మొగ్గు చూపడమే మిస్త్రీ కి చేదు అనుభవం మిగిల్చింది.ఇదే విషయం మీద ఓ నెల కిందట మిస్త్రీ ని కలిసిన రతన్ టాటా చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగమని సూటిగానే చెప్పారట.లేకుంటే అందుకు తగ్గ పరిణామాలకు సిద్ధంగా వుండాలని సున్నితంగా హెచ్చరించారట.కానీ సైరస్ మిస్త్రీ రాజీనామా ప్రకటన చేయకపోవడంతో బోర్డు నిర్ణయంతో ఆయన్ని తప్పించారు.

బోర్డు నిర్ణయంపై మిస్త్రీ కోర్టుని ఆశ్రయిస్తారని అంతా భావించారు.కానీ అయన ప్రస్తుతానికి ఓ ఈమెయిల్ అస్త్రాన్ని ప్రయోగించారు.తనని తొలిగించడానికి అనుసరించిన విధానం బాగాలేదని అయన తప్పుబట్టారు.బోర్డు అసాధారణ,విపరీత చర్యని మిస్త్రీ ఆవేదన చెందారు.మొత్తం తొమ్మిది మంది బోర్డు సభ్యుల్లో ఆరుగురు మిస్త్రీ కి వ్యతిరేకంగా ఓటేశారు.వారిని ఉద్దేశించి బోర్డు కి మిస్త్రీ ఈ మెయిల్ ద్వారా నిరసన తెలిపారు.

SHARE