Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయం ఎంత నాటకీయం? పునాది ఎంత బలంగా వున్నా ఒక్క తప్పటడుగు ఆ పునాదిని కూకటివేళ్లతో పెకలించేస్తుంది.ఇప్పుడు అదే జరిగింది సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు విషయంలో. టీడీపీ తో దశాబ్దాల అనుబంధాన్ని కాదనుకుని 2014 ఎన్నికలకి ముందు వైసీపీ లో చేరి దాడి పెద్ద తప్పే చేశారు.కొడుకు ఓటమి పక్కనబెడితే అక్కడ ఏ మాత్రం ఇమడలేకపోయారు దాడి. అందుకే వెంటనే జగన్ ని టార్గెట్ చేసి వైసీపీ నుంచి బయటపడ్డారు.అప్పటి నుంచి టీడీపీ లో చేరేందుకు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు దాడి.అయితే స్థానిక రాజకీయాలతో ఆ అవకాశం రానే లేదు.విడిపోయినంత తేలిగ్గా కలవలేమని అర్ధమైంది.కానీ కాలం గడిచే కొద్దీ ఆ ఎదురు చూపులు చూసే ఓపిక తగ్గింది.అది అసహనం గా మారింది.ఆ అసహనమే ఇప్పుడు టీడీపీ తలుపులు ఎప్పటికీ తెరుచుకోని పరిస్థితికి దారి తీసేలా వున్నాయి.ఇంతకీ ఆ పరిస్థితికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలు కూడా ఓ కారణం.
అనకాపల్లిలో ఎన్టీఆర్ ఫాన్స్ ఇటీవల ఆయన బర్త్ డే వేడుకల్ని ఘనంగా చేశారు. ఆ వేడుకలకి దాడిని పిలిచారు.దాడి కూడా ఎన్టీఆర్ ఫాన్స్ ని ఉత్సాహపరిచేందుకు పెద్ద ఎన్టీఆర్ కి సినిమా రంగంలోనే గాక అన్ని రంగాల్లో జూనియర్ సరైన వారసుడని చెప్పాడు.ఆ మాటలు టీడీపీలో ఎక్కడికి చేరాలో అక్కడికే చేరాయి.దీంతో ప్రస్తుతానికి టీడీపీ తలుపులు తెరుచుకోవడం కష్టమే అన్న మాట వినిపిస్తోంది.ఆ విధంగా దాడికి ఎన్టీఆర్ భజన చేటు చేసింది.