Posted [relativedate]
వైస్రాయ్ ఘటన సమయంలో తమ్ముళ్ల తిరుగుబాటుని ఎదుర్కోడానికి ఎన్టీఆర్ విఫలం కావడానికి మరో కారణం వెలుగుజూసింది..అదే జోస్యం..తెలుగుతమ్ముళ్లుతో చంద్రబాబు అసమ్మతి రాజకీయాలు నడుపుతున్నాడని తెలిసిన అధినేత ఎన్టీఆర్ ఏమి చేసాడంటే …ఢిల్లీ నుంచి ఓ పేరున్న జోతిష్కుడిని పిలిపించారు.ఆయనకి తన జాతకం,బాబు జాతకం చూపించారు.అబ్బే బాబుకి రాజయోగం లేదని ఆ జోస్యుడు చెప్పిన మాటలు నమ్మి పరిస్థితి చేయిదాటి పోయేదాకా ఎన్టీఆర్ తిరుగుబాటు గురించి తక్కువ అంచనా వేశారు.దాంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.జోస్యంతో పాటు తన ప్రజాదరణతో ఎన్నికైన ఎమ్మెల్యేలు తనకే ఎదురుతిరుగుతారని ఎన్టీఆర్ అసలు ఊహించలేదు.
పదవి పోయాక కూడా ఎన్టీఆర్ బాబు పుట్టిన రోజు లో తప్పు ఉండొచ్చని,లేక జోస్యుడు చేత కూడా అబద్ధం చెప్పించి ఉంటారని భావించారు తప్ప జోస్యం తప్పని అనుకోలేదట.ఈ విషయాలన్నీ ఆ పార్టీ లో సుదీర్ఘ కాలం పనిచేసిన దాడి వీరభద్ర రావు గ్రంధస్తం చేయబోతున్నారు.ఈ పుస్తకంలో ఎన్టీఆర్ గురించి ప్రపంచానికి తెలియని మరెన్నో విషయాలు వెల్లడించబోతున్నట్టు దాడి వివరిస్తున్నారు.