డైలీ రేటు మారితే కష్టం కాదా..?

0
445
daily changes in petrol price

Posted [relativedate]

daily changes in petrol priceఇప్పటికే పదిహేను రోజులకోసారి రేటు మారుతున్న పెట్రోల్.. ఇకపై రోజూ మారితే ఎలాగని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అటు బంకులు కూడా మరీ రోజూ అంటే మార్చడం కష్టమంటున్నాయి. ఇప్పటికే పెట్రో భారం ఎక్కువగా ఉందని, మళ్లీ డైలీ వడ్డింపు ఏంటని విమర్శలు వస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం త్వరలోనే దేశవ్యాప్తంగా డైలీ పెట్రోల్ రేటు మార్పిడిని అమలుచేయాలని పట్టుదలగా ఉంది. దీని వల్ల చాలా లాభాలున్నాయంటోంది. ఇంతకూ కేంద్రం భావిస్తున్న లాభాలేంటో తెలియాలంటే పెట్రో మార్కెట్ ను మనం కాస్త స్టడీ చేయాలి.

దేశంలో 95 శాతం రిటైల్ ఇంధన మార్కెట్ మూడు ప్రభుత్వ రంగం సంస్థలదే. అవి హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్. త్వరలో ఈ మూడు సంస్థలు కలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి.. డైలీ రేట్లు మార్చడం పెద్ద కష్టం కాదు. ఇక ఈ నిర్ణయం ప్రైవేట్ రంగంలోని రిలయెన్స్ ఎస్సార్ ఆయిల్ కూడా మేలు చేస్తుంది. పదిహేను రోజులకోసారి మారే రేటు కారణంగా నష్టాలు మూటకట్టుకుంటున్న చమురు కంపెనీలు డైలీ రేటు మార్పిడి వల్ల.. కచ్చితంగా లాభాలు వచ్చేలా తుది రేటు నిర్ణయించుకోలగలుగుతారు.

ఇక వినియోగదారులకు కూడా ఈ పెంపు లాభమే అంటున్నారు నిపుణులు. రోజువారీ పెట్రోల్ రేటు పెరిగితే.. అది కేవలం పైసల్లోనే ఉంటుందని చెబుతున్నారు. అప్పుడు పెద్దగా భారం పడుతున్నట్లు తెలియదని అంటున్నారు. ఇప్పటిలాగా ఒకేసారి రూపాయల్లో పెరిగే కంటే.. పైసల్లో తేడాను పెద్దగా పట్టించుకోరనే భావన ఉంది. కానీ రోజువారీ పెట్రోల్ మార్పిడి ఎంతవరకు కచ్చితంగా అమలౌతుంది, బంకుల్లో పరిస్థితి ప్రభుత్వం అనుకుంటున్నట్లే ఉంటుందా.. అనే విషయం తెలియాలంటే మాత్రం మొదట ఐదు నగరాల్లో ఈ పద్ధతి ఎంతవరకు విజయవంతమౌతుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.

Leave a Reply