Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు మారనున్న విషయం తెలిసిందే. ఈ లెక్కన అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరను బట్టి ప్రతి రోజూ కాస్త అటుఇటుగా ధరలు మారుతూనే ఉంటాయి. ప్రతి నగరం, పట్టణానికి, ఒక్కో పెట్రోల్ బంకులో ఒక్కో ధర కూడా ఉంటాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్లు ధరలో కాస్త తేడా చూపించే అవకాశం ఉండటంతో పెట్రోల్ బంకును బట్టి కూడా రేట్లలో తేడాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ మారే ధరలను వినియోగదారులు తెలుసుకొనే వీలు కల్పించాయి ఈ ఆయిల్ కంపెనీలు. ప్రతి రోజూ ప్రతి పెట్రోల్ పంప్ దగ్గర ఆ రోజు ధరలను ముందుగానే ప్రకటిస్తారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ పంప్స్‌లో రోజువారీ పెట్రోల్ ధరలను తెలసుకోవాలంటే… ఓ ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. RSP స్పేస్ డీలర్ కోడ్‌ను 9224992249కు పంపాలి. డీలర్కోడ్ ప్రతి పెట్రోల్ పంపు పరిసరాల్లో రాసి ఉంటుంది.
ఇక హిందుస్థాన్ పెట్రోలియం పెట్రోల్ పంప్స్‌లో ధరలు తెలుసుకోవడానికి HPPRICE స్పేస్ డీలర్ కోడ్‌ను 9222201122కు ఎస్సెమ్మెస్ చేయాల్సి ఉంటుంది. హెచ్‌పీసీఎల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సదరు పెట్రోల్ పంప్‌ను లొకేషన్‌ను బట్టి ధరలు చెక్ చేసుకోవచ్చు.
ఇక భారత పెట్రోలియం పెట్రోల్ పంప్స్‌లో రేట్ల కోసం RSP స్పేస్ డీలర్కోడ్ను 9223112222కు ఎస్సెమ్మెస్ చేయాలి. స్మార్ట్‌డ్రైవ్ యాప్ ద్వారా కూడా పెట్రోల్ బంక్ లొకేట్ చేసి ధర తెలుసుకోవచ్చు. లేదంటే భారత్ పెట్రోలియం వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. టోల్‌ఫ్రీ నంబర్ 1800224344 నంబర్‌కు డయల్ చేసినా పెట్రోల్ ధరలు తెలుస్తాయి.