తుపాకీ పేల్చింది డక్కల బాబు ..

   dakkala babu gun fair yadagiri
సికింద్రాబాదు పరిధిలోని బోయిన్ పల్లిలో నేటి మధ్యాహ్నం చోటుచేసుకున్న కాల్పుల ఘ‌ట‌న‌లో దోషిని పోలీసులు గుర్తించారు. పాత‌ బోయిన్ పల్లిలోని మల్లికార్జుననగర్ లో బైక్ పై వచ్చిన దుండగుడిని డక్కల బాబుగా గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ నేత యాదగిరితో ఇతనికి భూవివాదం ఉన్నట్టు గుర్తించారు. ఆల్వాల్ లో 4 ఎకరాల భూమి విషయంలో వీరిద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. రెండు మూడు నెలలుగా దీనిపై అనేక దఫాలుగా చర్చలు జరిగాయి. ఇవాళ కూడా అదే విషయంపై మాట్లాడటానికి యాదగిరి దగ్గరకు డక్కల బాబు, రాజు వచ్చారు.
మాటామాటాపెరగడంతో కాల్పులకు దారి తీసినట్లు తెలుస్తోంది. యాదగరిని హతమార్చాలన్న లక్ష్యంతో డక్కల బాబు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.. యాదగిరి సాహసం, సకాలంలో వైద్యసహాయం అందడంతో అతనికి ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. కాగా, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న డక్కల బాబును అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చేపట్టారు.
 
ఇతనిపై ఇప్పటికే సికింద్రాబాద్ పరిసర పోలీస్ స్టేషన్లలో పలు కేసులున్నాయని వారు తెలిపారు కాల్పులు జరిగిన తర్వాత బుల్లెట్ గాయాలతోనే యాదగిరి పోలీసు స్టేషన్‌కు వచ్చారని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి  చెప్పారు. అయితే ఈ ఘటనలో ఉపయోగించిన తుపాకి ఎవరిదనే విషయమై ఇంకా స్పష్టత లేదన్నారు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని సీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం యాదగిరి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని,ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు.
SHARE