జానారెడ్డిపై దళిత వ్యతిరేక ముద్ర?

0
250
dalit opposition to Janareddy

 Posted [relativedate]

dalit opposition to Janareddy
సీఎల్పీ నేత జానారెడ్డి తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఆయన ప్రభుత్వానికి ఫేవర్ గా ఉంటారన్న అనుమానాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ లోనూ ఒక సామాజిక వర్గానికే ఆయన అండగా ఉంటారన్న విమర్శలు ఇప్పుడు మొదలయ్యాయి. జానారెడ్డిపై సొంత పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే సంపత్ అలగడమే అందుకు నిదర్శనం.

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఇటీవల ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని తీసుకొచ్చింది. ఎస్సీలకు సంబంధించిన చట్టం కాబట్టి.. దీనిపై ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్ లో ఎస్సీ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, భట్టి విక్రమార్క, సంపత్ ఉన్నారు. గీతారెడ్డి, భట్టి ఎలాగూ పెద్ద నాయకులు కాబట్టి.. జానారెడ్డి వారికి మాట్లాడే అవకాశం కల్పించారు. కానీ యువ ఎమ్మెల్యే అయిన సంపత్ ను ఆయన విస్మరించారు. తనకు అవకాశం ఇవ్వాలని పదేపదే కోరినా జానా పట్టించుకోలేదన్న విమర్శ వినిపిస్తోంది.

బడ్జెట్ పై పద్దుల సందర్భంగా మరో యువ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి అవకాశం కోసం జానారెడ్డి..పదే పదే స్పీకర్ ను అడగడం కనిపించింది. కానీ ఆయన ఎందుకనో సంపత్ విషయంలో ఆ చొరవ చూపలేకపోయారు. దీంతో సంపత్ తీవ్రంగా మనస్తాపం చెందారు. కాంగ్రెస్ విప్ పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు అసెంబ్లీకి నల్లకండువాతో హాజరయ్యారు. కాంగ్రెస్ సభ్యులకు దూరంగా కూర్చున్నారు. దీంతో జానా సహా కాంగ్రెస్ సభ్యులంతా అవాక్కయ్యారు. జానా ఆయనను పిలిచినా సంపత్ మాట్లాడకుండా వెళ్లిపోయారని టాక్.

మొత్తానికి అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ లోని అసంతృప్తి సెగలు బయటపడ్డాయి. జానారెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో స్పష్టమైంది. ఒక దళిత ఎమ్మెల్యే ఇంత మనస్తాపం చెందడంపై పార్టీ శ్రేణుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక సీనియర్ నేతగా అసెంబ్లీలో జానా తీరు సరిగా లేదన్న వాదన వినిపిస్తోంది. మరి సంపత్ వ్యవహారం ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా..? మరింత ముదురుతుందా? చూడాలి.

Leave a Reply