Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమాల జాబితాలో అమీర్ ఖాన్ ‘పీకే’ మరియు ‘దంగల్’ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పీకే సినిమా చైనాలో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమాలు చాలా అరుదుగా చైనాలో విడుదల అవుతాయి. చైనాలో పీకేకు మంచి ఆధరణ లభించింది. దాంతో ‘దంగల్’ను కూడా చైనాలో విడుదల చేయాలని నిర్ణయించారు.
మల్లయోధుడి పాత్రలో అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం ఇండియా మరియు ఓవర్సీస్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. దాంతో చైనాలో కూడా అక్కడి ప్రాంతీయ భాషలోకి డబ్బింగ్ చేసి విడుదల చేసేందుకు అనుమతి దక్కింది. అతి త్వరలోనే చైనాలోకి డబ్బింగ్ చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు. చైనాలో విడుదలైతే ఖచ్చితంగా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఖాయం అని అంటున్నారు. అదే కనుక జరిగితే ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమాగా ‘బాహుబలి’ నిలుస్తుందని భావించిన వారికి నిరాశే మిగలనుంది. బాహుబలి చైనాలో విడుదల అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే మొదటి పార్ట్ ఫ్లాప్ అయ్యింది. దాంతో రెండవ పార్ట్‌కు అక్కడ ఆధరణ దక్కుతుందని ఏ ఒక్కరు భావించడం లేదు. అందుకే దంగల్ నెం.1 స్థానంలో నిలవడం ఖాయం.