Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇండియన్ సినిమా వెయ్యి కోట్లు సాధించడం అసాధ్యం అని భావిస్తున్న సమయంలో ‘బాహుబలి’ చిత్రం ఏకంగా 1300 కోట్లు వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది. ఒక ప్రాంతీయ భాష చిత్రం ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. వెయ్యి కోట్లు సాధించిన మొదటి ఇండియన్ సినిమాగా ‘బాహుబలి’ రికార్డు సాధించింది. బాహుబలి వెయ్యి కోట్లు సాధించి వారం అయ్యిందో లేదో మరో ఇండియన్ సినిమా వెయ్యి కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం విడుదలైన సమయంలో 750 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా చైనాలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. చైనాలో ‘దంగల్’ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన 10 రోజుల్లో 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చైనాలో వచ్చిన కలెక్షన్స్‌తో ‘దంగల్’ చిత్రం కూడా వెయ్యి కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఒక్క నెలలోనే రెండు వెయ్యి కోట్ల చిత్రాలు రావడం చర్చనీయాంశం అయ్యింది. అయితే బిగ్గెస్ట్ సినిమాగా మాత్రం ‘బాహుబలి 2’ నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. ‘దంగల్’ చిత్రం 1100 కోట్ల వరకు చేరుకుంటుందని, అంతకు మించి వసూళ్లు సాధ్యం కాదని భావిస్తున్నారు. అయితే ‘బాహుబలి 2’ మాత్రం 1500 కోట్లకు కాస్త అటు ఇటుగా వసూళ్లను నమోదు చేయబోతున్నారు.