ఆ దెయ్యాలు ఎలా వచ్చాయి?

0
600

dangerous devil fishes krishna water

కృష్ణా పుష్కరాలకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్న సమయాన ప్రభుత్వాన్ని, భక్తుల్ని ఓ వార్త కలవరపెడుతోంది. అదే … కృష్ణా జలాల్లో డెవిల్ ఫిష్ లు … దెయ్యపు చేపలు. ..వంటి నిండా ముళ్ళతో వుండే ఈ చేపలు సాటి చేపల్నే ఆహారంగా తీసుకొంటాయట. పైగా జాలర్ల వలల్ని కూడా చీల్చేస్తున్నాయట… అసలు ఇందులో నిజం ఉందొ లేదో తెలుసుకోడానికి అధికారులు కూడా ఈ అంశంపై దృష్టిసారించారు.

మరోవైపు కృష్ణా జలాల్లో ఇలాంటి చేపలు వుండే అవకాశం లేదని తెలుస్తోంది. ఇటీవల పట్టిసీమ నుంచి వచ్చిన గోదావరి జలాల వల్ల దెయ్యపు చేపలు కృష్ణా లోకి చేరి వుంటాయని కొందరు చెప్తుండగా … బుడమేరు నుంచి వచ్చే అవకాశముందని మరికొందరి అభిప్రాయం. ఏదేమైనా భక్తులకు ఆందోళన కలిగిస్తున్న ఈ అంశం మీద సంబంధిత అధికారులు ఓ స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుంది.

Leave a Reply