దసరా సినిమాలు.. థియేటర్ కష్టాలు !

Posted October 6, 2016

    dasara season movies  theaters problems

టాలీవుడ్ లో దసరా సీజన్ హంగామా మొదలైంది. ‘హైపర్’తో హీరో రామ్ దసరా సీజన్ కి స్వాగతం పలికాడు. ఆ తర్వాత ఏకంగా ఐదు సినిమాలు.. జాగ్వార్, ఈడు గోల్డ్ ఎహే, అభినేత్రి, ప్రేమమ్, మన ఊరి రామాయణం.. దసరా హంగామాని కంటిన్యూ చేయనున్నాయి. అయితే, ఈ సీజన్ లో 5సినిమాలు రిలీజ్ కానుండటంతో.. ఏ సినిమాకి వెళ్లాలనే కన్ఫూజన్ లో ఉన్నాడు ప్రేక్షకుడు. ఆప్షన్స్ చాలనే ఉందన్నందున ఫస్ట్ టాక్ తర్వాత డిసైడ్ అవుదామనే ధీమాతో ప్రేక్షకుడు ఉన్నాడు.

మరోవైపు, ఈ దసరా సీజన్ కి రిలీజ్ అవ్వనున్న చిత్రాలకి థియేటర్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకేసారి 5 సినిమాలు రానుండటంతో థియేటర్స్ కొరత తలెత్తడం సాధారణమే. అయితే, మాస్ ఎలిమెంట్స్ లేని  మన ఊరి రామాయణం, అభినేత్రి చిత్రాలకి బీ, సీ సెంటర్స్ థియేటర్స్ దొరకడం లేదు. ప్రమోషన్స్ లోనూ అదరగొట్టిన జాగ్వార్, ప్రేమమ్, ఈడు గోల్డ్ ఎహే సినిమాల పరిస్థితి కాస్త బెటర్ గా ఉంది. అయితే, ఇదంతా సినిమా ఫలితం తెలిసేంత వరకే.. ఒక్కసారి
సినిమా టాక్ బయటికొస్తే సమీకరణాలు మారవచ్చు. గుడ్ టాక్ సొంతం చేసుకొన్న చిత్రాల థియేటర్స్ సంఖ్య పెరగడం ఖాయం. ఫ్లాప్ టాక్ సినిమాలు షెడ్ కెళ్లడం కూడా తప్పనిసరి. మరి.. ఈ 5చిత్రాలు ఏయే చిత్రాలు హిట్టు చిత్రాలుగా నిలుస్తాయో చూడాలి.

SHARE